ఆమె (కవిత)
BY Telugu Global18 March 2023 6:43 AM GMT

X
Telugu Global18 March 2023 6:43 AM GMT
కష్టాల్లో
ఓదార్పునిచ్చేది ఆమె.
సుఖాల్లో
సంతోషాన్నిచ్చేది ఆమె.
చిరాకులో
మనశ్శాoతి నిచ్చేది ఆమె.
అతని ఆదేశం
చెప్పింది చేస్తుంది.
ఆమె ప్రోత్సాహం
అన్నింటిని చేయిస్తుంది.
ఆమె లేని బాల్యo
మాసిపోతుంది.
ఆమె లేని కౌమారం
కరిగిపోతుంది.
ఆమెలేని యవ్వనం
గమ్యంలేని ప్రయత్నముల
మొదలవుతుంది.
ఆమెలేని జీవితం
మోడుబారిన వృద్ధాప్యంలా
పండిపోతుంది.
మనం వేసే ప్రతి అడుగు
ఆమె అయినప్పుడు,
మనం చూసే ప్రతి వెలుగు
ఆమె అయినప్పుడు,
ఆకాశమంత ప్రేమకు నిదర్శనం
Advertisement
ఆమె అయినప్పుడు,
ఆమె ఎందుకు వద్దు?
మనకు జన్మనిచ్చేది ఆమె.
జీవితాన్నిచ్చేది ఆమె.
ప్రేమనిచ్చేది ఆమె.
జన్మనివ్వడానికి
ఆమె కావాలి.
జీవితాన్నివ్వడానికి
ఆమె కావాలి.
ప్రేమను పంచడానికి
ఆమె కావాలి.
కానీ,
మన కడుపున పుట్టిన ఆమెను ఎందుకు
వద్దనుకుంటున్నాం?
ఒక్కక్షణం ఆలోచించoడి
ఆకునమోని
Next Story