Telugu Global
Arts & Literature

మిత్రుడి జ్ఞాపకం

మిత్రుడి జ్ఞాపకం
X

అవంతికి ఉన్న ఆస్తి అంతా కలిపి ఒక బంగారు ఉంగరం. వర్తకం చేసుకునే అతని మిత్రుడొకడు ఆ ఉంగరాన్ని, కాజెయ్యాలని, అవంతితో, "మిత్రమా, 'నేను వ్యాపారం నిమిత్తం దీర్ఘప్రయాణం మీద పోతున్నాను. అంతకాలం నిన్ను చూడసుగదా అని బెంగగా ఉన్నది.అందుచేత ని ఉంగరం ఇచ్చావంటే, అది చూసినప్పుడల్లా నిన్ను చూసినట్టేసంతోషిస్తాను."

అన్నాడు

దానికి అవంతి " ఆయ్యో మిత్రమా! నేను మాత్రం నిన్ను చూడకుండా అంతకాలంఎలా ఉండగలను? నేను నీకు ఈ ఉంగరం ఇయ్యకపోతే, దీన్ని చూసినప్పుడల్లా, దీన్ని నీకు

ఇయ్యలేక పోయానుగదా అన్నది జ్ఞాపకం వచ్చి, నిన్ను చూసినట్టే ఆనందం కలుగుతుంది!"అన్నాడు .

First Published:  14 Nov 2022 9:01 AM GMT
Next Story