Telugu Global
Andhra Pradesh

మొన్న సైకిల్ పోవాలి.. నిన్న సైకిల్ వద్దు..

చంద్రబాబు పదే పదే ఇలా మాట్లాడుతుండే సరికి వైసీపీ నాయకులు కూడా పరాచకాలాడుతున్నారు. మళ్లీ ఏసేశాడు అంటూ చంద్రబాబు కొత్త వీడియోని ట్వీట్ చేశారు మంత్రి అంబటి రాంబాబు.

మొన్న సైకిల్ పోవాలి.. నిన్న సైకిల్ వద్దు..
X

చంద్రబాబుకి ఏమైంది, పదే పదే ఆయన అదే తప్పు ఎందుకు చేస్తున్నారు. గతంలో తొట్రుపాటు లేకుండా ఏకధాటిగా ప్రసంగించే అలవాటున్న ఆయన, ఇప్పుడిలా తడబడుతున్నారెందుకు..? ఇతర విషయాల్లో ఎవరూ పెద్దగా పట్టించుకోరు, కనీసం సైకిల్ గుర్తుకి ఓటేయాలి, సైకిల్ ని గెలిపించండి అని చెప్పడానికి కూడా చంద్రబాబు అంతలా తడబడాలా..? ఇదే ఇప్పుడు వైసీపీకి ప్రధాన అస్త్రంగా మారింది. రెండు రోజులుగా చంద్రబాబుని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబుకి చిప్ దొబ్బింది, మైండ్ పోయింది అంటూ తాము చెబుతుంటే ఎవరూ నమ్మడం లేదని, ఇప్పుడు ప్రత్యేకంగా నమ్మించాల్సిన అవసరం లేకుండా చంద్రబాబే తన బండారం బయటపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

మొన్న విజయనగరంలో సైకిల్ పోవాలి అంటూ నాలిక కరచుకున్న చంద్రబాబు, నిన్న బొబ్బిలి బహిరంగ సభలో సైకిల్ వద్దు అంటూ పిలుపునిచ్చారు. "అందరూ పిడికిళ్లు రెండు బిగించి, రెండు చేతులూ బిగించి చెప్పాలి, పౌరుషం రావాలి, సైకిల్ వద్దు.. సారీ..!!". అంటూ తడబడ్డారు. దీంతో మరోసారి వైసీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ మొదలు పెట్టింది.


ఏయ్.. మళ్లీ ఏసేశాడు..!

చంద్రబాబు పదే పదే ఇలా మాట్లాడుతుండే సరికి వైసీపీ నాయకులు కూడా పరాచకాలాడుతున్నారు. మంత్రి అంబటి రాంబాబు మళ్లీ ఏసేశాడు అంటూ చంద్రబాబు కొత్త వీడియోని ట్వీట్ చేశారు. నిన్న సైకిల్ పోవాలి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఆయన తథాస్తు అంటూ రైటప్ ఇచ్చారు. మొత్తమ్మీద రాష్ట్రవ్యాప్త పర్యటన పెట్టుకున్న చంద్రబాబు తన ప్రంసగాలతో నారా లోకేష్ ని గుర్తు చేస్తున్నారంటున్నారు నెటిజన్లు. వైసీపీ సెటైర్లు వేస్తుండే సరికి టీడీపీ కూడా జగన్ పాత వీడియోలన్నిటినీ బయటకు తీస్తోంది. గతంలో జగన్ తడబడిన మాటల వీడియోలను ఇప్పుడు అప్ లోడ్ చేస్తోంది.

First Published:  25 Dec 2022 2:38 AM GMT
Next Story