Telugu Global
Andhra Pradesh

ఐటీ నోటీసుల‌తో చంద్ర‌బాబు అవినీతి తేట‌తెల్ల‌మైంది - వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

చంద్ర‌బాబుకు ఐటీ ఇచ్చిన నోటీసుల‌తో ఆయ‌న అవినీతి తేట‌తెల్ల‌మైంద‌ని చెప్పారు. ఐటీ నోటీసుల అంశంపై జాతీయ మీడియా పూర్తిస్థాయిలో వార్త‌లు రాసింద‌ని గుర్తుచేశారు.

ఐటీ నోటీసుల‌తో చంద్ర‌బాబు అవినీతి తేట‌తెల్ల‌మైంది  - వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి
X

ఐటీ నోటీసుల‌పై చంద్ర‌బాబు ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల‌కు దీనిపై ఏం స‌మాధానం చెబుతార‌ని ఆయ‌న నిల‌దీశారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబుకు ఐటీ ఇచ్చిన నోటీసుల‌తో ఆయ‌న అవినీతి తేట‌తెల్ల‌మైంద‌ని చెప్పారు. ఐటీ నోటీసుల అంశంపై జాతీయ మీడియా పూర్తిస్థాయిలో వార్త‌లు రాసింద‌ని గుర్తుచేశారు.

ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లోంజీల ద్వారా షెల్ కంపెనీలకు వెళ్లి.. అక్కడి నుంచి చంద్రబాబుకు నిధులు అందాయని ఐటీ చెప్పిందని స‌జ్జ‌ల చెప్పారు. నోటీసులో ఇదే చెప్పింద‌ని కూడా వివ‌రించారు. దీనిపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు మాట్లాడటం లేదని ప్ర‌శ్నించారు. ఐటీ అడిగిన లంచాల వ్యవహారం గురించి మాట్లాడకుండా సాంకేతిక అంశాల గురించి మాట్లాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమ‌ర్శించారు. ఇన్నేళ్ల చంద్రబాబు రాజకీయం అంతా ఇలాగే సాగుతూ వచ్చిందన్నారు.

కిట్ బ్యాగ్స్ అందాయని పూర్తి సమాచారం ఉన్నందునే ఐటీ నోటీసులు ఇచ్చిందని, కొన్ని తరాలపాటు లాభం పొందేలా చంద్రబాబు స్కాం చేశార‌ని స‌జ్జ‌ల చెప్పారు. అమరావతి విషయంలో చంద్ర‌బాబు ఆయ‌న‌తో పాటు ఆయ‌న‌కు చెందిన‌వారంతా లాభం పొందేలా చేశారని గుర్తుచేశారు. పోలవరం విషయంలో అయితే ఏకంగా ఏటీఎంగా మార్చారని సాక్షాత్తూ ప్రధానే చెప్పారని ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు.

First Published:  2 Sep 2023 10:47 AM GMT
Next Story