Telugu Global
Andhra Pradesh

'బండి'కి కౌంటర్లు లేవు, వైసీపీ సైలెన్స్.. కారణం ఏంటి..?

ఇప్పుడు బండి సంజయ్ కూడా సరిగ్గా అదే పాయింట్ ని హైలెట్ చేశారు. తాగుబోతుల్ని తాకట్టు పెట్టి అప్పు చేస్తారా..? అని ప్రశ్నించారు. మద్యాన్ని నిషేధిస్తామని హామీలిచ్చి మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా..? అని అడిగారు. అందుకే బండికి సమాధానమిచ్చేందుకు వైసీపీ నేతలెవరూ ముందుకు రాలేదు.

బండికి కౌంటర్లు లేవు, వైసీపీ సైలెన్స్.. కారణం ఏంటి..?
X

వైసీపీ మద్యపాన నిషేధం హామీ దగ్గర్నుంచి, తిరుమల చేతి కర్రల వ్యవహారం వరకు తీవ్ర ఆరోపణలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. మామూలుగా ఇలాంటి ఆరోపణలు వచ్చిన వెంటనే వైసీపీ నుంచి కౌంటర్ అటాక్ మొదలవుతుంది. తాజా మంత్రులు, మాజీ మంత్రులు అందరూ హడావిడి చేస్తారు. జనసేన, లేదా టీడీపీ నుంచి ఈ ఆరోపణలు వస్తే వెంటనే తెరపైకి వచ్చేందుకు కార్పొరేషన్ల చైర్మన్లు కూడా రెడీగానే ఉంటారు. కానీ పొరుగు రాష్ట్రం బీజేపీ నేత నిందలేసి ఒకరోజు గడిచినా వైసీపీ నేతలు ఇంకా మౌన వ్రతంలోనే ఉండటం విశేషం.

టీడీపీ, జనసేన నేతల ఆరోపణలకు వైసీపీ నుంచి రియాక్షన్లు యమా స్పీడ్ గా వస్తుంటాయి. బీజేపీ నేతలు కౌంటర్లిస్తే మాత్రం కాస్త ఆచితూచి స్పందిస్తుంటారు వైసీపీ నేతలు. ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి చేసిన విమర్శలకు కూడా బాగానే సమాధానాలిచ్చారు. బండి సంజయ్ వ్యాఖ్యలను మాత్రం వారు పట్టించుకోకపోవడం విశేషం.

నవరత్నాలలో 99 శాతం అమలు చేశాం, 99.9 శాతం అమలు చేశామని చెప్పుకునే వైసీపీ నేతలకు మద్యపాన నిషేధం ఒక్కటే పంటికింద రాయిలా తగులుతోంది. బహుశా ఆ హామీని అమలు చేయడం సీఎం జగన్ కి అసాధ్యం అనే చెప్పాలి. ఆ హామీ అమలు చేస్తే, సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ కష్టమైపోతుందని చెప్పక తప్పదు. నేరుగా మద్యంపై వచ్చే ఆదాయాన్నే సంక్షేమ పథకాలకు తరలిస్తున్నారని చెప్పలేం కానీ, ఆ ఆదాయం తగ్గితే, ఇక్కడ పథకాల అమలు కూడా పడకేస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అందుకే ఆ విషయంలో ఎవరు ఎన్నిసార్లు విమర్శించినా వైసీపీనుంచి మౌనమే సమాధానం. త్వరలో చేస్తాం, టైమ్ చూసుకుని చేస్తాం అనే సాగతీత వ్యవహారాలు కూడా వినిపించవు, కనిపించవు. ఇప్పుడు బండి సంజయ్ కూడా సరిగ్గా అదే పాయింట్ ని హైలెట్ చేశారు. తాగుబోతుల్ని తాకట్టు పెట్టి అప్పు చేస్తారా..? అని ప్రశ్నించారు. మద్యాన్ని నిషేధిస్తామని హామీలిచ్చి మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా..? అని అడిగారు. అందుకే బండికి సమాధానమిచ్చేందుకు వైసీపీ నేతలెవరూ ముందుకు రాలేదు.

First Published:  22 Aug 2023 2:11 PM GMT
Next Story