Telugu Global
Andhra Pradesh

పార్టీ పంచాయితీలన్నీ ఇక విశాఖకే.. తాడేపల్లి కనుమరుగు

ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రాకతో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుందని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. పాలనా రాజధానిగా పనులు ఊపందుకున్నాక విశాఖకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఖాయం అన్నారు.

పార్టీ పంచాయితీలన్నీ ఇక విశాఖకే.. తాడేపల్లి కనుమరుగు
X

వైసీపీ కేంద్ర కార్యాలయం, తాడేపల్లి..

ఇకపై ఈ అడ్రస్ కనుమరుగు కాబోతోంది, ఇక నుంచి వైసీపీ వ్యవహారాలన్నీ విశాఖ నుంచే జరుగుతాయని తెలిపారు ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి. విశాఖ నుంచి పాలన మొదలవుతుంది అని సీఎం జగన్ ప్రకటించిన కాసేపటికే వైవీ సుబ్బారెడ్డి, పార్టీ వ్యవహారాలపై స్పందించారు. ఇకపై విశాఖ నుంచే వైసీపీ రాష్ట్ర పార్టీ వ్యవహారాలు కొనసాగుతాయి, అందుకు తగ్గట్టుగానే ఆఫీసు నిర్మాణం జరిగిందని తెలిపారు వైవీ.

విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన నిర్ణయం అభివృద్ధికి సూచిక అని అన్నారు వైవీ సుబ్బారెడ్డి. సీఎం జగన్ మొదటి నుంచీ విశాఖ పరిపాలన రాజధాని అంటున్నారని, అదే చేస్తున్నారని చెప్పారు. దశల వారీగా వివిధ విభాగాల తరలింపు జరుగుతుందన్నారు. ప్రస్తుతానికి శాసన, న్యాయ రాజధానిగా అమరావతి కొనసాగుతుందన్నారు.

ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రాకతో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుందని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. పాలనా రాజధానిగా పనులు ఊపందుకున్నాక విశాఖకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఖాయం అన్నారు. ఇప్పటికే విశాఖకు పెట్టుబడులు వస్తున్నాయని, సీఎం జగన్ రాకతో ఆ పెట్టుబడులు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ నుంచి ఏపీ పరిపాలన కొనసాగుతుందని, అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని అన్నారు వైవీ సుబ్బారెడ్డి.

First Published:  20 Sep 2023 4:04 PM GMT
Next Story