Telugu Global
Andhra Pradesh

కోర్టు చెప్పినా మారని తీరు.. తెరపైకి వివేకా భార్య

సీఎం జగన్ కు వివేకా సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ అంటూ ఎల్లో మీడియా హడావిడి మొదలు పెట్టింది.

కోర్టు చెప్పినా మారని తీరు.. తెరపైకి వివేకా భార్య
X

వైఎస్ వివేకాను హత్య చేసింది ఎవరు..? చేయించింది ఎవరు..? హత్యకు గల కారణాలు ఏంటి..? వీటిపై కోర్టుల్లో విచారణ జరుగుతోంది. ఈ అంశం న్యాయస్థానాల పరిధిలో ఉండగా.. ఫలానా వారే హత్య చేశారు, వారికి టికెట్ ఎందుకిచ్చారు, వారికి ఎందుకు మద్దతిస్తున్నారంటూ మాట్లాడటం సరికాదు. అలా మాట్లాడొద్దని, ఎన్నికల ప్రసంగాల్లో వివేకా హత్యకేసు వ్యవహారాన్ని తీసుకు రావొద్దని కడప కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. కానీ జగన్ ని దెబ్బకొట్టడానికి ప్రత్యర్థులు దాన్నే ప్రధాన అస్త్రంగా భావిస్తున్నారు. అందుకే కోర్టులు చెప్పినా కూడా వినకుండా వివేకా హత్యకేసు అంశాన్ని పదే పదే హైలైట్ చేస్తున్నారు. తాజాగా వివేకా సతీమణి సౌభాగ్యమ్మను తెరపైకి తెచ్చారు.

సీఎం జగన్ కు వివేకా సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ అంటూ ఎల్లో మీడియా హడావిడి మొదలు పెట్టింది. వివేకా హత్యకు కారకులైన వారికి మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీసినట్టు ఎల్లో మీడియా పతాక శీర్షికలతో హోరెత్తిస్తోంది. ఆ లేఖలో ఆమె జగన్ ని నిలదీసినట్టు, న్యాయంవైపు నిలబడాలని కోరినట్టు, చెల్లెళ్లను బాధించడం సరికాదని చెప్పినట్టు రాసుకొచ్చారు. షర్మిల, సునీత కోర్టు దెబ్బకు సైలెంట్ గా ఉంటే, పరోక్షంగా ఈ వ్యవహారంలో వివేకా భార్య సౌభాగ్యమ్మను తీసుకొచ్చి రచ్చ చేస్తోంది ఎల్లో మీడియా.

ఇన్నాళ్లు వివేకా హత్యకేసు విచారణ సందర్భంగా కనీసం మీడియా ముందుకు రాని సౌభాగ్యమ్మ.. ఇప్పుడు హఠాత్తుగా షర్మిలకు వత్తాసు పలుకుతూ తెరపైకి రావడం విశేషం. కేవలం షర్మిలకు రాజకీయ లాభం చేకూర్చేందుకే ఆమె ఇప్పుడిలా లేఖ రాశారు. దాన్ని ఎల్లో మీడియాకు అందించి జగన్ పై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పదే పదే అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పరోక్షంగా జగన్ ని ఇబ్బంది పెట్టాలనేది షర్మిల, సునీత ఆలోచన. అది తమ వల్ల కావట్లేదని వివేకా భార్యను రంగంలోకి దించారు. వీటన్నిటి వెనక ఉన్న క్రిమినల్ మైండ్ చంద్రబాబు అనే విషయం అందరికీ తెలుసు. ఆయన ప్రోద్బలంతోనే షర్మిల, సునీత రెచ్చిపోతున్నారు, వారికి ఎల్లో మీడియా అండగా నిలబడుతోంది. చివరకు వివేకా భార్యను కూడా సీన్ లోకి తీసుకొచ్చి నీఛరాజకీయాలకు పాల్పడుతోంది ఎల్లో బ్యాచ్.

First Published:  25 April 2024 6:30 AM GMT
Next Story