Telugu Global
Andhra Pradesh

వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి బహిరంగ లేఖ

వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన వివేకా కుటుంబం రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ లోనే ఎందుకు ఉందని నిలదీశారు వైఎస్ లక్ష్మి.

వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి బహిరంగ లేఖ
X

ఇటీవల సీఎం వైఎస్ జగన్ కు వివేకా సతీమణి సౌభాగ్యమ్మ రాసిన బహిరంగ లేఖ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హంతకులకు ఆయన సపోర్ట్ చేస్తున్నారని, హంతకులకు ఎంపీ టికెట్ ఇచ్చి ప్రోతహిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పుడు ఆ లేఖకు కౌంటర్ లేఖ బయటకు వచ్చింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మి ఈ లేఖ రాశారు. సౌభాగ్యమ్మ లేఖకు కౌంటర్ గా ఈ లేఖ విడుదల చేశారు.


ఈ లేఖలో సౌభాగ్యమ్మకు పలు ప్రశ్నలు సంధించారు వైఎస్ లక్ష్మి. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన వివేకా కుటుంబం ఎందుకు రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ లోనే ఉందని నిలదీశారు. వైఎస్ విజయమ్మపై స్వయానా ఆమె మరిది వైఎస్ వివేకా పోటీ చేశారని, కనీసం అప్పుడైనా కుటుంబం గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. జగన్ కి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మీరు రాజకీయ స్వార్థంతో విజయమ్మపై పోటీ చేసినప్పుడు వాళ్లు ఎంత బాధపడి ఉంటారని అడిగారు వైఎస్ లక్ష్మి.

తప్పు తెలుసుకోండి..

వైఎస్ షర్మిల, సునీత.. శత్రువుల చేతుల్లో పావులాగా మారారని, ఇప్పటికైనా వారు తప్పు తెలుసుకోవాలని అన్నారు వైఎస్ లక్ష్మి. సునీత న్యాయపోరాటం చేస్తే కచ్చితంగా జగన్ సంపూర్ణ మద్దతు ఉండేదని, కానీ ఆమె రాజకీయ స్వలాభం కోసం వైఎస్ఆర్ శత్రువులతో కలసిపోయారని అన్నారు. పదే పదే అవినాష్ రెడ్డిని హంతకుడు అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కేసు విచారణ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఇలా నిందలు మోపడం కరెక్టేనా అని అన్నారు. "హత్యకు కారకులైన వారు మీతోనే ఉన్నారు, మీలోనే ఉన్నారు.. దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా..?" అని నిలదీశారు వైఎస్ లక్ష్మి.

First Published:  26 April 2024 6:32 AM GMT
Next Story