Telugu Global
Andhra Pradesh

ఎల్లో మీడియా లాజిక్ మరచిపోయిందా?

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వెళుతున్నారు కాదా అలాగే బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌కు వెళుతున్నారు.. అందులో తప్పేంటో అర్థం కావటంలేదు.

ఎల్లో మీడియా లాజిక్ మరచిపోయిందా?
X

‘రాష్ట్రంలో ఉద్యోగాల్లేవ్’ అనే బ్యానర్ హెడ్డింగ్‌తో ఎల్లో మీడియా పెద్ద స్టోరీ ఇచ్చింది. నిజంగా ఆ స్టోరీ చదవితే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న మంటతో వ్యతిరేకంగా రాయాలి కాబట్టి స్టోరీ రాసినట్లు తెలిసిపోతోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ చీటింగ్ కేసులో రామోజీరావును ఏ 1, శైలజను ఏ2గా సీఐడీ కేసులు బుక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇద్దరినీ చెరోసారి విచారించింది. రెండుసారి విచారణకు రెడీ అవుతుంది. ఆ మంట రామోజీలో స్పష్టంగా కనబడుతోంది.

తనపైనే చీటింగ్ కేసు బుక్ చేసి విచారిస్తారా అన్న కోపంతో ఏవేవో అడ్డగోలు రాతలన్నీ రాసేస్తున్నారు. ఆ రాయటంలో లాజిక్ మరచిపోతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉద్యోగాల్లేవ్ అని రాసిన ఎల్లో మీడియా చంద్రబాబు హయాంలో మాత్రం ఏడాదికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పుంటే బాగుండేది. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళంతా పక్క రాష్ట్రాల్లో కొలువులకు వెళ్ళిపోతున్నారట. చంద్రబాబు హయాంలో ఇంజనీరింగ్ చదివిన వాళ్లంద‌రికీ ఏపీలోనే ఉద్యోగాలు వచ్చాయా? ఉద్యోగాల కోసం అప్పుడూ పక్క రాష్ట్రాలకే వెళ్ళారు ఇప్పుడూ వెళుతున్నారు.

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వెళుతున్నారు కాదా అలాగే బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌కు వెళుతున్నారు.. అందులో తప్పేంటో అర్థంకావటంలేదు. ఇపుడిపుడే ఏపీలో పరిశ్రమలు వస్తున్న విషయం అందరు చూస్తున్నదే. వైజాగ్‌ని ఐటీ హబ్‌గా ప్రభుత్వం రెడీ చేస్తోంది. ఇన్ఫోసిస్, రాక్ స్టాడ్, లాంటి పెద్ద కంపెనీలు వచ్చాయి. అమెజాన్ లాంటి మరెన్నో కంపెనీలు వైజాగ్‌లో ఏర్పాటు కాబోతున్నాయి.

చంద్రబాబు హయాంలో మొత్తం డెవలప్‌మెంట్ అంతా అమ‌రావతిలోనే చేయాలని ఏవేవో కలలు కనటంతో మిగిలిన రాష్ట్రం పూర్తిగా వెనకబడిపోయింది. పేరుకు వైజాగ్ అని చంద్రబాబు కలవరించినా అభివృద్ధి మొత్తాన్ని అమరావతిలోనే కేంద్రీకృతమయ్యేట్లుగా చూశారు. విశాఖకు ఇపుడిపుడే ఆద‌ర‌ణ‌ పెరుగుతోంది. జగన్ అధికారంలోకి రాగానే రెండేళ్ళు కరోనా సమస్య లేకపోతే ఈ పాటికే వైజాగ్‌లో ఐటి పరిశ్రమ ఊపందుకునేదేమో. కాబట్టి ఎల్లో మీడియా చెప్పినట్లు ఉద్యోగాలకు ఇపుడే కాదు చంద్రబాబు హయాంలో కూడా పక్క రాష్ట్రాలకే వెళ్ళేవాళ్ళు.

First Published:  8 May 2023 7:06 AM GMT
Next Story