Telugu Global
Andhra Pradesh

ఎల్లోమీడియా ఎజెండా ఇదేనా..?

జీతాలు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా కన్వర్టు చేయమని డిమాండ్లు చేస్తున్న ఉద్యోగులకు మద్దతుగా ఉంటామని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్ మాట్లాడుతున్నారు. మద్దతు అంటున్నారు కానీ, తాము అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతామని, ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తామని మాత్రం ఎక్కడా చెప్పటంలేదు.

ఎల్లోమీడియా ఎజెండా ఇదేనా..?
X

తెలుగు రాష్ట్రాల్లో మీడియా తన పరిధిని ఎప్పుడో దాటేసింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుకు అండగా నిలబడాలని ఎన్టీఆర్‌కు వెన్నుపోటు సమయంలో 1995లో మెజారిటీ మీడియా డిసైడ్ అయ్యిందో అప్పటి నుంచే మీడియా విలువల పతనం మొదలైంది. అప్పుడు మొదలైన మీడియా దిగజారుడుతనం 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక పీక్ స్టేజికి చేరుకున్నది. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే తమ పరిస్థితేంటో చంద్రబాబుతో పాటు ఎల్లోమీడియా యాజమాన్యానికి కూడా బాగా తెలుసు.

అందుకనే ఏ చిన్న అవకాశం దొరికినా ఎల్లోమీడియా వదిలిపెట్టడంలేదు. తాజా పరిణామాలు ఏమిటంటే.. టికెట్లు రావని అనుకున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గాలు మారక తప్పని మంత్రులు, ఎమ్మెల్యేల‌ను జగన్ పైకి రెచ్చగొట్టడం. రెండోది అంగన్వాడీలు, ఆశావర్కర్లు, పారిశుధ్య కార్మికులను క్తి రెచ్చగొట్టి సమ్మెలోకి వెళ్ళేట్లు చేయటం. వీళ్ళ కోరికలు సబబా.. కాదా అన్న విచక్షణతో పనేలేదు. అందరినీ వీలైనంతగా రెచ్చగొట్టి జగన్ ప్రభుత్వంపై జనాల్లో ఎంతవీలైతే అంత వ్యతిరేకతను పెంచటమే ఎజెండాతో ఎల్లోమీడియా పనిచేస్తోంది.

జీతాలు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా కన్వర్టు చేయమని డిమాండ్లు చేస్తున్న ఉద్యోగులకు మద్దతుగా ఉంటామని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్ మాట్లాడుతున్నారు. మద్దతు అంటున్నారు కానీ, తాము అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతామని, ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తామని మాత్రం ఎక్కడా చెప్పటంలేదు. ఎల్లోమీడియా కూడా ఈ విషయాన్ని కావాలని మరుగుపరుస్తోంది. ఈ విషయాలను జనాలందరూ గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్లోమీడియా ఆశలు నెరవేరుతుందా.. అనే చర్చ పెరిగిపోతోంది. ఎందుకంటే.. ఎల్లోమీడియా, చంద్రబాబు ఆశించిన స్థాయిలో అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఇప్పటికైతే పెద్దగా వ్యతిరేకత కనబడటంలేదు.

జగన్ టికెట్లు ఇవ్వకూడదని అనుకుంటున్న సిట్టింగులు పార్టీలో ఉన్నా.. బయటకు వెళ్ళిపోయినా జగన్ పట్టించుకోరని అందరికీ తెలిసిందే. ఇక ఆశావర్కర్లు, పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీలను ఏదో పద్ధ‌తిలో ప్రభుత్వం దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. మొత్తంమీద ఎల్లోమీడియా ఎంత ప్రయత్నించినా జనాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడుతోందా.. అన్నదే పాయింట్. అందుకనే ఎల్లోమీడియా రెచ్చగొట్టే ప్రయత్నాలను మరింతగా పెంచుతోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.

First Published:  28 Dec 2023 5:55 AM GMT
Next Story