Telugu Global
Andhra Pradesh

ఎమర్జెన్సీని మించిన పరిస్థితులున్నాయా?

ఎమర్జెన్సీ సంగతి కరెక్టేకానీ ఇక్కడున్నది ఇందిరాగాంధీ కాదు జగన్. ఇప్పుడు చంద్రబాబు అరెస్టయ్యింది ప్రశ్నించినందుకు కాదు అవినీతి కేసులో. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనేందుకు సీఐడీ దగ్గర ఇప్పటికే బోలెడన్ని ఆధారాలున్నాయి. ఆధారాలతో ఏసీబీ కోర్టు, హైకోర్టు ఏకీభవించింది.

ఎమర్జెన్సీని మించిన పరిస్థితులున్నాయా?
X

ఎమర్జెన్సీని మించిన పరిస్థితులున్నాయా?

గిట్టని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పాలకుడుగా ఉన్నాడు. రాబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబునాయుడు నాయకత్వంలో టీడీపీ గెలుస్తుందనే నమ్మకం కనబడటంలేదు. టీడీపీ గెలవకపోతే చంద్రబాబు, టీడీపీ భవిష్యత్తు మాత్రమే కాదు యావత్ ఎల్లోమీడియా భవిష్యత్తు కూడా చీకటిమయం అయిపోతుందనే టెన్షన్ పెరిగిపోతోంది. అందుకని ఏం చేయాలో అర్థంకావటంలేదు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసింది. ప్రాథ‌మిక సాక్ష్యాధారాలున్నాయని ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది.

ఇక అప్పటి నుండి మొదలైంది ఎల్లోమీడియా అంకమ్మశివాలు. ఎలాగైనా చంద్రబాబుకు సానుభూతి తీసుకురావాలని, ఆ సానుభూతి పవనాలతో రాబోయే ఎన్నికల్లో టీడీపీని గట్టెక్కించాలన్నది ఎల్లోమీడియా యాజమాన్యాల ఆలోచన. అందుకనే జగన్‌కు వ్యతిరేకంగా అంతా కలిసి జాయింట్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అందుకనే పదేపదే జగన్ వ్యతిరేక, చంద్రబాబుకు సానుభూతిని పెంచే వార్తలు, కథనాలను అచ్చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ‘ఎమర్జెనీ’ని మించి.. అనే హెడ్డింగ్‌తో పేద్ద కథనం వచ్చింది.

అందులో ఏముందంటే అప్పటి ఇందిరాగాంధీని ప్రశ్నించినందుకు వాజ్‌పేయ్, జయప్రకాష్ నారాయణ, ఎల్కే అద్వాని, మొరార్జీదేశాయ్ లాంటి వాళ్ళని అరెస్టు చేసి జైల్లో పెట్టారట. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఘోరంగా ఓడిపోయిందట. ఈ కథనంలోనే వీళ్ళ శునకానందం తెలిసిపోతోంది. ఎమర్జెన్సీ సంగతి కరెక్టేకానీ ఇక్కడున్నది ఇందిరాగాంధీ కాదు జగన్. ఇప్పుడు చంద్రబాబు అరెస్టయ్యింది ప్రశ్నించినందుకు కాదు అవినీతి కేసులో. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనేందుకు సీఐడీ దగ్గర ఇప్పటికే బోలెడన్ని ఆధారాలున్నాయి. ఆధారాలతో ఏసీబీ కోర్టు, హైకోర్టు ఏకీభవించింది.

పైగా చంద్రబాబేమీ వాజ్‌పేజ్, జయప్రకాష్ నారాయణ, ఎల్కే అద్వానీ కాదు. అత్యంత అవినీతిపరులైన రాజకీయబ‌నేతల్లో ఒక‌రిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. చంద్రబాబు మీద అవినీతి ఆరోపణలు దాదాపు 25 ఏళ్ళుగా వినిపిస్తునే ఉన్నాయి. కాకపోతే ఆధారాలతో దొరకటం ఇప్పుడే. పైగా అప్పటి ఎమర్జెన్సీ పరిస్థితుల‌కు ఇప్పటికి అసలు సంబంధమే లేదు. నిజంగానే రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులే ఉండుంటే ఎల్లోమీడియా, ప్రతిపక్షాలు జగన్‌పైన ప్రతిరోజు టన్నుల కొద్ది బురదచల్లగలిగేవేనా? చంద్రబాబు అరెస్టయినా జనాల్లో సానుభూతి ఎక్కడా కనబడటంలేదన్నది ఎల్లోమీడియాను బాగా కలవరపెట్టేస్తోంది. అందుకనే పెయిడ్ ఆందోళనలు చేయిస్తు బుర్రకు తోచిన రాతలు రాసి తృప్తిపడుతోంది.

First Published:  25 Sep 2023 5:49 AM GMT
Next Story