Telugu Global
Andhra Pradesh

ఐప్యాక్ మీద ఏడుపు మొదలైందా?

విద్యార్థుల ముసుగులో ఐప్యాక్ బృందం ఊరూరా సర్వేలు చేస్తోందట.. సోషల్ మీడియాలో ఫేక్ వార్ చేస్తోందట.. ఓట్ల గోల్ మాల్..కులాల మధ్య చిచ్చుపెడుతోందట.. గెలుపు కోసం ఐప్యాక్ బృందం అడ్డగోలు వ్యూహాలు రచిస్తోందని ఎల్లో మీడియా ఏడుపు మొదలుపెట్టింది.

ఐప్యాక్ మీద ఏడుపు మొదలైందా?
X

ఐప్యాక్ మీద ఏడుపు మొదలైందా?

ఇంతకాలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తు ఎల్లో మీడియా గోల చేస్తుంది. ఇప్పుడు జగన్‌కు తోడు రాజకీయ వ్యూహాకర్త ప్ర‌శాంత్ కిషోర్‌కి చెందిన‌ ఐప్యాక్ బృందం మీద కూడా ఏడుపు మొదలుపెట్టింది. ‘విచ్ఛిన్నమే వ్యూహం’ అనే హెడ్డింగ్‌తో పెద్ద బ్యానర్ స్టోరీ అచ్చేసింది. గెలవాలంటే రెండు మార్గాలున్నాయట. ఒకటి చేసిన మేలు చెప్పుకోవటం. రెండోది చేయబోయే మేలు చెప్పుకుని ఓట్లేయించుకోవటమట. కానీ జగన్ మాత్రం ఐప్యాక్ సాయంతో విధ్వంసకర వ్యూహాలను అమలు చేస్తున్నారట.

అనైతిక, అనుచిత దారిలో ఐప్యాక్ బృందం వ్యూహాలను పన్నుతోందట. విద్యార్థుల ముసుగులో ఐప్యాక్ బృందం ఊరూరా సర్వేలు చేస్తోందట. సోషల్ మీడియాలో ఫేక్ వార్ చేస్తోందట. ఓట్ల గోల్ మాల్..కులాల మధ్య చిచ్చుపెడుతోందట. గెలుపు కోసం అడ్డగోలు వ్యూహాలు రచిస్తోందని ఏడుపు మొదలుపెట్టింది. జగన్+ఐప్యాక్ విషయంలో ఎల్లో మీడియా చెప్పిందంతా చంద్రబాబునాయుడు అనుసరిస్తున్నదే. 2019లో గెలుపున‌కు జగన్ ప్రత్యేకంగా ఐప్యాక్ అనే సంస్థ‌ను రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకున్నారు.

కానీ చంద్రబాబు కోసం ఎల్లో మీడియా దశాబ్దాలుగా ఇదే చేస్తోంది. మీడియా ముసుగులో ఎల్లో మీడియా చంద్రబాబు కోసమే పనిచేస్తున్నది. ఎల్లో మీడియా అనైతిక బంధంతోనే 1995లో ఎన్టీయార్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటుకు ముందునుండే పద్ధ‌తి ప్రకారం ఎన్టీయార్ క్యారెక్టర్‌పై విషప్రచారం చేశారు. తాము చెప్పిన అబద్ధాలన్నింటినీ నిజమే అని అప్పట్లో జనాలను ఎల్లో మీడియా నమ్మించగలిగింది. అప్పటి సంగతి వదిలేస్తే 2009 నుండి జగన్‌పై ఎల్లో మీడియా అనుసరిస్తున్న వ్యూహమిదే.

జగన్ లక్షకోట్ల అవినీతికి పాల్పడ్డాడు, దోచుకున్నాడని కొంతకాలం జనాలను నమ్మించగలిగింది ఎల్లో మీడియా. ఆ ప్రచారం 2014లో టీడీపీ కూటమి గెలుపున‌కు ఉపయోగపడింది. అయితే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పరిపాలన చూసిన తర్వాత జనాలు మేల్కొన్నారు. 2019 ఎన్నికల్లో కూడా అదే పద్ధ‌తిలో ఎల్లో మీడియా జగన్ వ్యతిరేక ప్రచారం చేసినా జనాలు నమ్మలేదు. అందుకనే టీడీపీకి అంతటి ఘోర పరాభవం ఎదురైంది. తమ మాట, రాతలను జనాలు నమ్మలేదనే మంట చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియాలో పెరిగిపోతోంది.

వచ్చే ఎన్నికల్లో 2019 ఫలితమే రిపీట్ అయితే చంద్రబాబుతో పాటు తమకు కూడా భవిష్యత్తుండదని ఎల్లో మీడియాలో భయం మొదలైంది. అందుకనే విషప్రచారం చేస్తునే ఉంది. అయినా జనాలు పెద్దగా నమ్మటంలేదు. లేకపోతే ఐప్యాక్ విద్యార్థుల రూపంలో సర్వేలు చేస్తే ఏమిటి? ఉద్యోగుల రూపంలో చేస్తే ఏమిటి ? జగన్-ఐప్యాక్ మధ్య అనైతిక బంధమట. చంద్రబాబుకు ఎవరితో అయినా నైతిక బంధముందా? సోషల్ మీడియాలో ఫేక్ వారట. టీడీపీ+ఎల్లోమీడియా చేస్తున్నదేమిటి? గెలుపు కోసం ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి. చంద్రబాబు వ్యూహాలతో పాటు తాము ఎంత బురదచల్లుతున్నా జనాలు పట్టించుకోవటంలేదని ఎల్లో మీడియా ఏడుపు పెరిగిపోతోంది. ముందుముందు ఇంకెత ఏడుస్తుందో చూడాల్సిందే.

First Published:  29 Jun 2023 4:57 AM GMT
Next Story