Telugu Global
Andhra Pradesh

జగన్ - చంద్రబాబు మధ్య తేడా వివరించిన ఎల్లో మీడియా

ఢిల్లీకి జగన్ వెళ్ళి మోడీని కలిసేది తన కేసులను కొట్టించుకోవటానికి, వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అవినాష్‌ను కాపాడుకోవటానికే అని చంద్రబాబు, తమ్ముళ్ళు పదేపదే గోల చేస్తున్నారు. మోడీని కలిసిన‌ప్పుడల్లా జగన్ పెండింగ్ నిధుల కోసం చేసిన విజ్ఞప్తుల ఫలితంగానే ఇంతభారీ మొత్తం మంజూరైందని ఎల్లో మీడియానే రాసింది.

జగన్ - చంద్రబాబు మధ్య తేడా వివరించిన ఎల్లో మీడియా
X

‘రాష్ట్రంపై డబ్బుల వాన’ అనే హెడ్డింగ్‌తో ఎల్లో మీడియా ఫ్రంట్ పేజి స్టోరీ ఒకటిరాసింది. అదేమిటంటే ప్రత్యేక సాధారణ ఆర్థికసాయం రూపంలో రాష్ట్రానికి కేంద్రం రూ.10,461 కోట్లు మంజూరు చేసిందట. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఐదేళ్ళు ఎంత గింజుకున్నా కేంద్రం పట్టించుకోలేదట. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మాత్రం అంత భారీగా అదీ ఏకమొత్తంలోనే మంజూరు చేసేసిందని బాధపడుతూ రాసింది.

ఎన్నికల ఏడాదిలో ఇంత భారీ మొత్తాన్ని కేంద్రం విడుదల చేయటమంటే జగన్‌కు భారీ ఊరట అని చెప్పింది. సాధారణ పరిస్థితుల్లో కొన్నినెలల పాటు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంతగా నరేంద్ర మోడీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వానికి ఆర్థికసాయం చేయటం విశేషమే అని చెప్పింది. 2014-2019 మధ్యలో ఈ నిధుల కోసం చంద్రబాబు ఎంతగింజుకున్నా, ఎన్నిసార్లు ప్రధానమంత్రిని కలిసినా ఎలాంటి ఉపయోగం కనబడలేదట.

తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ కూడా ప్రధానమంత్రిని కలిసినపుడల్లా నిధుల కోసం విజ్ఞప్తులు చేస్తూనే ఉండటంతో భారీ మొత్తం మంజూరైనట్లు ఎల్లో మీడియానే స్పష్టంగా రాసింది. అంటే ఎల్లో మీడియా రాతల్లోనే జగన్‌కు చంద్రబాబుకు ఉన్న తేడాను బయటపెట్టింది. అప్పట్లో చంద్రబాబు ఎప్పుడు మోడీని కలిసినా తన వ్యక్తిగత అవసరాలకు లేదా జగన్‌ను ఎప్పుడు అరెస్టు చేస్తారని మాత్రమే అడిగేవారని అప్పట్లో బీజేపీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ చాలాసార్లు చెప్పారు.

ఇప్పుడు ఎల్లో మీడియానే ప్రధానిని కలిసినపుడల్లా నిధుల కోసం జగన్ చేసిన విజ్ఞప్తులు ఫలించి భారీ మొత్తంలో మంజూరైందని రాసింది. ఢిల్లీకి జగన్ వెళ్ళి మోడీని కలిసేది తన కేసులను కొట్టించుకోవటానికి, వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అవినాష్‌ను కాపాడుకోవటానికే అని చంద్రబాబు, తమ్ముళ్ళు పదేపదే గోల చేస్తున్నారు. మోడీని కలిసిన‌ప్పుడల్లా జగన్ పెండింగ్ నిధుల కోసం చేసిన విజ్ఞప్తుల ఫలితంగానే ఇంతభారీ మొత్తం మంజూరైందని ఎల్లో మీడియానే రాసింది. కాకపోతే చంద్రబాబు హయాంలో మంజూరు కాని నిధులు ఇప్పుడు విడుదలవ్వటం ఏమిటి? అదికూడా ఒకేసారి వేల కోట్లు మంజూరయ్యాయే అన్న ఏడుపు రాతల్లో కనబడింది.

First Published:  23 May 2023 7:20 AM GMT
Next Story