Telugu Global
Andhra Pradesh

పీక్స్ కు చేరిన ఎల్లోమీడియా ఏడుపు

మోడీనుండి ఎల్లోబ్యాచ్ అనుకున్నట్లు సానుకూలత రాకపోగా ఎవరిని ఎక్కడుంచాలో మోడీ అక్కడుంచారు. పైగా బీజేపీతోనే పవన్ కలిసి నడవాలని గట్టిగా చెప్పారు.

పీక్స్ కు చేరిన ఎల్లోమీడియా ఏడుపు
X

ఎల్లోమీడియా ఏడుపు పీక్స్ కు చేరుకుంటున్నట్లుంది. విశాఖపట్నంలో శనివారం గ్రాండ్ సక్సెస్ అయిన నరేంద్రమోడీ కార్యక్రమాలపై ఏమి రాయాలో అర్థ‌మైనట్లులేదు. అందుకనే కోడిగుడ్డుకు ఈకలు పీకే ప్రయత్నం చేసింది. శుక్రవారం మోడీ-జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీతో రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరుగుతాయని ఎల్లోమీడియా భారీగా అంచనాలు వేసుకుంది. వీళ్ళద్దరి భేటీతో చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా రాజకీయమంతా మారిపోతుందని చాలా లెక్కలేసుకుంది. అయితే భేటీ తర్వాత మోడీని పవన్ కలవకుండా ఉండుంటే బాగుండేదనే భావన ఎల్లోబ్యాచ్ లో బాగా పెరిగిపోయిందట.

కారణం ఏమిటంటే.. మోడీనుండి ఎల్లోబ్యాచ్ అనుకున్నట్లు సానుకూలత రాకపోగా ఎవరిని ఎక్కడుంచాలో మోడీ అక్కడుంచారు. పైగా బీజేపీతోనే పవన్ కలిసి నడవాలని గట్టిగా చెప్పారు. మోడీ ఇలాంటి ట్విస్టు ఇస్తారని వీళ్ళెవరూ ఊహించలేదు. మోడీ-పవన్ భేటీ తర్వాత జగన్మోహన్ రెడ్డికి కష్టాలు మొదలవుతాయని ఎంతో ఆశించిన వీళ్ళకి తీవ్ర నిరాశ‌ మొదలైంది. అందుకనే వీళ్ళిద్దరి భేటీపై కనీసం ఒక్కటంటే ఒక్క వార్తకూడా ఇవ్వలేదు.

తాము ఆశించిన దానికి భిన్నంగా భేటీ జరిగిందని వీళ్ళకి అర్థ‌మైపోయింది. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచక మూగేడుపులు ఏడుస్తున్నారు. దాని ప్రభావమే ఆదివారం నాటి బ్యానర్ కథనం. 'అర్థ‌మవుతోందా మోడీసర్' అని పెద్ద హెడ్డింగ్ పెట్టిరాసిన కథనంలో తెలుగులోనే సీఎం విన్నపాలు అంటు తెగబాధపడిపోయింది. సుతిమెత్తగా కోరటానికీ తంటాలే.. రాసుకొచ్చిన స్పీచ్ చదవటానికీ కష్టాలే.. మూడు మాటెత్తకుండా దాటవేత.. మోడీని ఇబ్బందిపెట్టకూడదనే స్పీచును జగన్ తెలుగులో చదివారట.

జగన్ గనుక స్పీచును ఇంగ్లీష్‌లోనో లేకపోతే హిందీలోనో చదివుంటే తర్వాత మాట్లాడిన మోడీ సమాధానం చెప్పాల్సుంటుందట. అందుకనే మోడీకి ఇబ్బంది కలిగించద్దనే తెలుగులో మాట్లాడారట. ఒకవేళ ఇంగ్లీషులోనో, హిందీలోనో మాట్లాడుంటే బహిరంగసభకు వచ్చిన జనాలకు అర్థంకూకాడదనే జగన్ తెలుగులో మాట్లాడలేదని ఎల్లోమీడియానే రాసుండేది.

ఇక్కడ గమనించాల్సిందేమంటే మోడీ రాకసందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బహిరంగసభ బ్రహ్మాండమైన విజయం సాధించింది. వేదికమీద జగన్ తో మోడీ చాలా హ్యాపీగా కనిపించారు. ఇద్దరుకూడా జోకులేసుకుంటూ నవ్వుకున్నారు. మోడీ పిడికిలి బిగించి భుజంతట్టి నవ్వుతూ జగన్ కు ఏదో చెప్పారు. ఇలాంటి దృశ్యాలను ఎల్లోమీడియా తట్టుకోలేకపోయింది. రాష్ట్ర ప్రయోజనాల గురించి జగన్ గట్టిగా డిమాండ్ వినిపించటమే కాకుండా తన డిమాండ్ల వినతులను మోడీకి అందించారు. దీనిమీద ఏమిరాయాలో అర్థంకాకే జగన్ ఇంగ్లీషులో మాట్లాడారు, తడబడ్డారు అంటు తమ ఏడుపును బయటపెట్టుకున్నది ఎల్లోమీడియా.

First Published:  13 Nov 2022 4:29 AM GMT
Next Story