Telugu Global
Andhra Pradesh

బీజేపీనే అసలైన విలనా? సర్టిఫై చేసిన ఎల్లో మీడియా

రైల్వే జోన్ కార్యాలయానికి శంకుస్ధాపన, అంతర్జాతీయ విమానాశ్రయం, గిరిజన యూనివర్సిటికి శంకుస్ధాపనలు జరిగి పనులు మొదలైతే క్రెడిట్ అంతా వైసీపీ ఖాతాలోనే పడుతుందని కమలనాథులు చెప్పారట. అందుకనే చివరి నిమిషంలో పై కార్యక్రమాల్లో మోడీ పాల్గొనటం లేదని తెలిసింది.

బీజేపీనే అసలైన విలనా? సర్టిఫై చేసిన ఎల్లో మీడియా
X

ముందుగా అనుకున్నట్లు కాకుండా నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో చాలా మార్పులు జరిగాయి. ఒరిజినల్ ప్లాన్ అయితే విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణా కోస్తా రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటుకు భూమి పూజ జరగాలి. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విజయనగరంలో గిరిజన యూనివర్సిటీకి శంకుస్ధాపనలు జరగాలి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అయితే చివరి నిమిషంలో పై కార్యక్రమాలన్నీ రద్దయిపోయాయట.

నిజంగా రైల్వే జోన్ కార్యాలయానికి శంకుస్ధాపన, అంతర్జాతీయ విమానాశ్రయం, గిరిజన యూనివర్సిటికి మోడీ శంకుస్ధాపనలు చేస్తే వెంటనే పనులు మొదలైపోతాయి. నిజంగానే వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి పై మూడు అంశాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే చివరి నిమిషంలో ప్రధాన మంత్రి కార్యాలయం వీటన్నింటికీ నో చెప్పిందని సమాచారం. కారణం ఏమిటంటే రాష్ట్రంలో బీజేపీ ముఖ్యనేతలు పీఎంవోతో మాట్లాడి శంకుస్ధాపనలన్నింటినీ రద్దు చేయించారట.

కారణం ఏమిటంటే పైన చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు జరిగి పనులు మొదలైతే క్రెడిట్ అంతా వైసీపీ ఖాతాలోనే పడుతుందని కమలనాథులు చెప్పారట. అందుకనే చివరి నిమిషంలో పై కార్యక్రమాల్లో మోడీ పాల్గొనటం లేదని తెలిసింది. దీన్ని ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ విజయంగా చెప్పటమే విచిత్రంగా ఉంది. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు జరిగితే ఏ పార్టీకి లాభనష్టాలు జరుగుతుందన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే అంతిమంగా రాష్ట్రం లాభపడుతుందన్న విషయాన్ని కూడా ఎల్లో మీడియా మరచిపోయింది. ఇప్పుడు మోడీ శంకుస్ధాపనలు చేయకపోతే ఏమైపోతుంది ఆ పనేదో ఏదో సందర్భంలో జగనే కానిచ్చేస్తారు.

ఇక్కడ వైసీపీ మీద అక్కసుతో, జగన్ ఫెయిలయ్యారని ఎల్లో మీడియా సంతోషపడటం సంగతేమో కానీ మోడీని, బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్న విషయాన్ని మరచిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలకు జగన్ చొరవ తీసుకుంటే బీజేపీనే అడ్డుపడిందనే విషయం ఎల్లో మీడియా రాతల్లోనే బయటపడింది. రాష్ట్ర ప్రయోజనాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేసిందని ఎల్లో మీడియానే బయటపెట్టింది. ఎల్లో మీడియా రాతల వల్ల జగన్‌కు ప్లస్సే కానీ ఎలాంటి మైనస్సుండదు. మైనస్ ఏమన్నా ఉంటే అది మోడీకి, బీజేపీకే అన్న విషయాన్ని కూడా ఎల్లో మీడియా గ్రహించలేకపోయింది. మొత్తం కథనంలో రాష్ట్రానికి అసలైన విలన్ బీజేపీనే అన్న విషయాన్ని ఎల్లో మీడియా స‌ర్టిఫై చేసింది.

First Published:  11 Nov 2022 5:36 AM GMT
Next Story