Telugu Global
Andhra Pradesh

వారిపై అనర్హత వేటు వేయండి.. - వైసీపీ ఫిర్యాదు

వైసీపీ అధిష్టానం తాజాగా స్పందించింది. పార్టీ ఫిరాయించిన వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సోమవారం వైసీపీ ఫిర్యాదు చేసింది.

వారిపై అనర్హత వేటు వేయండి.. - వైసీపీ ఫిర్యాదు
X

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్‌కు, మండలి చైర్మన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. వారిలో ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి.రామచంద్రయ్య ఉన్నారు.

వీరి విషయంలో వైసీపీ అధిష్టానం తాజాగా స్పందించింది. పార్టీ ఫిరాయించిన వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సోమవారం వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ తరఫున మండలి కార్యదర్శికి ఎమ్మెల్సీలు మేరుగ మురళి, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.

ఎన్నికలకు ముందు అంటే నోటిఫికేషన్‌ రావడానికి దాదాపు నెల రోజుల ముందు వారిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ అధిష్టానం ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై తక్షణం స్పందించి వేటు వేసే అవకాశముంటుందా అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

First Published:  9 Jan 2024 2:50 AM GMT
Next Story