Telugu Global
Andhra Pradesh

నీలా దేశాలు తిరగను.. వేమిరెడ్డికి విజయసాయిరెడ్డి కౌంటర్

పార్టీలు మారడం తనకు తెలియదని.. రాజ్యసభ సభ్యుడిగా ప్రతి రోజూ సభకు హాజరయ్యానన్నారు. పార్లమెంటులో రాష్ట్ర సమస్యలను ఎక్కువగా ప్రస్తావించింది తానేనన్నారు.

నీలా దేశాలు తిరగను.. వేమిరెడ్డికి విజయసాయిరెడ్డి కౌంటర్
X

ప్రాణం పోయే వరకు జగన్‌ వెంటే ఉంటానన్నారు నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. విజయసాయి రెడ్డి గెలిస్తే ఢిల్లీకి ఎక్స్‌పోర్ట్‌ అవుతారంటూ.. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి చేసిన విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఎక్స్‌పోర్ట్‌, ఇంపోర్ట్ బిజినెస్‌లు చేస్తుండడం వల్ల అలవాటు ప్రకారం వేమిరెడ్డి ఎక్స్‌పోర్ట్ అనే పదాన్ని వాడారన్నారు విజయసాయిరెడ్డి. వేమిరెడ్డి తరహాలో తనకు ఏ వ్యాపారాలు లేవని.. పార్లమెంట్ సమావేశాలు మినహా మిగిలిన రోజుల్లో నెల్లూరులోనే ఉంటానని స్పష్టం చేశారు.


పార్టీలు మారడం తనకు తెలియదని.. రాజ్యసభ సభ్యుడిగా ప్రతి రోజూ సభకు హాజరయ్యానన్నారు. పార్లమెంటులో రాష్ట్ర సమస్యలను ఎక్కువగా ప్రస్తావించింది తానేనన్నారు. ఇక వేమిరెడ్డికి రాజ్యసభ మెంబరుగా పార్లమెంటుకు హాజ‌రుకాలేదని.. ఇటు నెల్లూరులోనూ లేరన్నారు. వ్యాపార పనుల్లో విదేశాల్లో తిరిగారంటూ వేమిరెడ్డికి చురకలు అంటించారు.

First Published:  4 April 2024 4:59 AM GMT
Next Story