Telugu Global
Andhra Pradesh

ఆర్ఆర్ఆర్ కచ్చితంగా ఆస్కార్ సాధిస్తుంది.. విజయసాయిరెడ్డి ట్వీట్

గిరిపుత్రులు బ్రిటీష్ వారిపై జరిపిన పోరాటం ఇతివృత్తంగా సాగిన ఈ చిత్రం కచ్చితంగా ఆస్కార్ సాధిస్తుందని ఆశిస్తున్నా.. అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఆర్ఆర్ఆర్ కచ్చితంగా ఆస్కార్ సాధిస్తుంది.. విజయసాయిరెడ్డి ట్వీట్
X

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాయకుల్లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒకరు. రాజకీయాలు, ఇతర అంశాలపై నిత్యం ఆయన స్పందిస్తూ ఉంటారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సైతం సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఇటీవల ఆయన సినిమాలకు సంబంధించిన అంశాల‌పై కూడా స్పందిస్తున్నారు. మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలైన సమయంలో ఆ చిత్ర బృందాన్ని ప్రశంసించారు. సమకాలీన అంశాలను స్పృశిస్తూ సందేశాత్మకంగా తీశారని మెచ్చుకున్నారు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సైమాలో ఏకంగా ఆరు అవార్డులు సాధించగా.. ఆ చిత్ర బృందాన్ని అభినందిస్తూ విజయసాయిరెడ్డి స్పెషల్ గా ట్వీట్ చేశారు. తాజాగా ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ అవార్డు రేసులో ఉన్నట్లు ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ 'వెరైటీ' ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరోలుగా నటించిన ఎన్టీఆర్, చరణ్ కూడా ఉత్తమ నటుల కేటగిరీలో పోటీ పడే అవకాశం ఉందని ఆ మ్యాగజైన్ పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారు. 'ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉండొచ్చన్న హాలీవుడ్ మ్యాగజైన్ అంచనాలు మన తెలుగు చిత్రస్థాయిని చాటి చెబుతున్నాయి. గిరిపుత్రులు బ్రిటీష్ వారిపై జరిపిన పోరాటం ఇతివృత్తంగా సాగిన ఈ చిత్రం కచ్చితంగా ఆస్కార్ సాధిస్తుందని ఆశిస్తున్నా.' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

First Published:  18 Sep 2022 9:01 AM GMT
Next Story