Telugu Global
Andhra Pradesh

బాబూ.. మీ వాళ్లు విశాఖకు ఎందుకొచ్చారు? దోచుకున్నది మీరు.. నిందలు మా మీదా?

ఉత్తరాంధ్రలో చంద్రంకు ఏం పని? వేల ఎకరాల ఆసామి గీతం మూర్తి ఎక్కడి నుంచి వచ్చాడు? వంగవీటి రంగా హంతకుడు వెలగపూడి విశాఖ ఎందుకొచ్చాడో చెప్పు’ అని విజయసాయిరెడ్డి నిలదీశారు.

బాబూ.. మీ వాళ్లు విశాఖకు ఎందుకొచ్చారు?  దోచుకున్నది మీరు.. నిందలు మా మీదా?
X

విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భూములను ఆక్రమిస్తున్నాడంటూ గత కొంతకాలంగా టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు పచ్చ మీడియాలో కూడా ఇందుకు సంబంధించిన వార్తలు పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి. నిజానికి వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల్లో భాగంగా విశాఖను పాలనా రాజధానిగా చేయాలని భావిస్తోంది. దీనిపై టీడీపీ ఉల్టా ప్రచారం చేస్తోంది. విశాఖ రాజధానిగా పనికిరాదని.. సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల నిత్యం తుపాన్‌లు వస్తాయంటూ కొంతకాలం ప్రచారం చేసింది. తాజాగా వైసీపీ నేతలు ఆ ప్రాంతంలో భూ కబ్జాలు చేస్తున్నారన్న ప్రచారం మొదలుపెట్టింది.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ధర్మానపై తీవ్ర స్థాయిలో టీడీపీ అండ్ కో విమర్శలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ అనుకూల పత్రికల్లోనూ ఇదే ప్రచారం సాగుతోంది. దీన్ని ఎప్పటికప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికకగా తిప్పి కొడుతున్నారు. తాజాగా ఆయన మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రక్షకులు ఎవరో భక్షకులు ఎవరో ప్రజలకు తెలుసునంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'విశాఖకు మేము ఎందుకు వచ్చామని నిత్యం చంద్రబాబు ప్రశ్నిస్తుంటారు. మరి గీతం వర్సిటీ అధినేత మూర్తి, టీడీపీ నేత వెలగపూడి, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఇక్కడ ఆస్తులు ఎలా కూడబెట్టుకున్నారని ప్రశ్నించారు. 'ముసలి చంద్రం, ఆయన దొంగల ముఠా కళ్లన్నీ విశాఖ వనరుల మీదనే. పేదలు వలస పోతుంటే ఆనందించారు. పరిశ్రమలు పెడతామని వస్తే బాబు అమరావతికి రమ్మనేవాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆయన హయాంలోనే బీజం పడింది. రక్షకులెవరో, భక్షకులేవరో ప్రజలకు తెలుసు' అంటూ ట్వీట్ చేశారు.


ఉత్తరాంధ్రలో చంద్రంకు ఏం పని? వేల ఎకరాల ఆసామి గీతం మూర్తి ఎక్కడి నుంచి వచ్చాడు? వంగవీటి రంగా హంతకుడు వెలగపూడి విశాఖ ఎందుకొచ్చాడో చెప్పు' అని విజయసాయిరెడ్డి నిలదీశారు. రామోజీరావు.. డాల్ఫిన్ హోటల్ కట్టినప్పుడు నోరెందుకు లేవలేదు? వీళ్లంతా మిడతల దండులా వచ్చి విశాఖలో 80% భూములు ఆక్రమిస్తే 'కమ్మ'గా ఉందా?' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

First Published:  9 Nov 2022 12:26 PM GMT
Next Story