Telugu Global
Andhra Pradesh

బాబు ట్రాప్‌లో అమిత్ షా పడతారా ? - విజయసాయిరెడ్డి

విజయసాయిరెడ్డి మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు. చంద్రబాబు ట్రాప్‌లో అమిత్ షా పడతారా..? అని ప్రశ్నించారు. టీడీపీ ట్రాప్‌లో పడాల్సిన అవసరం బీజేపీకి ఉంటుందా..? అని వ్యాఖ్యానించారు.

బాబు ట్రాప్‌లో అమిత్ షా పడతారా..? - విజయసాయిరెడ్డి
X

బాబు ట్రాప్‌లో అమిత్ షా పడతారా..? - విజయసాయిరెడ్డి

రాజకీయ పార్టీలు వేరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు వేరని వ్యాఖ్యానించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. ఏపీలో అవినీతి ఎక్కడ జరిగిందో అమిత్ షా, జేపీ నడ్డా చెప్పలేకపోయారన్నారు. కేవలం సాధారణ ఆరోపణలు మాత్రమే చేసినట్టుగా ఉందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులకు ఎప్పటికప్పుడు ఆడిటింగ్ జరుగుతుందని.. ఆ ఆడిటింగ్‌లో ఎక్కడైనా అవినీతిని గుర్తించారా అని ప్రశ్నించారు.

విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్నారు. వాటి గురించి అమిత్ షా, నడ్డా ప్రస్తావించలేదన్నారు. తమ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని ఒంటరిగానే వెళ్లి విజయం సాధిస్తుందని చెప్పారు. అయితే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు మంత్రులు గుడివాడ అమర్నాథ్‌, కొట్టు సత్యనారాయణలు.. టీడీపీ ట్రాప్‌లో బీజేపీ పడిందని ఆరోపించగా.. విజయసాయిరెడ్డి మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు. చంద్రబాబు ట్రాప్‌లో అమిత్ షా పడతారా..? అని ప్రశ్నించారు. టీడీపీ ట్రాప్‌లో పడాల్సిన అవసరం బీజేపీకి ఉంటుందా..? అని వ్యాఖ్యానించారు.

టీడీపీ మేనిఫెస్టోనూ ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. నవంబర్‌లో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత అక్కడి మేనిఫెస్టోలను కూడా కాపీ కొట్టి చంద్రబాబు పార్ట్‌ -2 మేనిఫెస్టోను విడుదల చేస్తారని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

First Published:  13 Jun 2023 1:39 PM GMT
Next Story