Telugu Global
Andhra Pradesh

అది మూడు కాళ్ల కుర్చీ.. - టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై విజయసాయిరెడ్డి

2018లో ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చానంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఇప్పుడు మళ్లీ ఎన్డీఏలో చేరడంలో మతలబు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అది మూడు కాళ్ల కుర్చీ.. - టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై విజయసాయిరెడ్డి
X

టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు పేల్చారు. ఇది మరో ప్యాకేజీతో ఏర్పాటైన పొత్తు అని విమర్శించారు. ఈ కూటమి మూడు కాళ్ల కుర్చీ అని.. కూలిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. 2014–19 మధ్య కాలంలో ఏపీకి చేసిన మోసం, అబద్ధాలు, అమలు చేయని వాగ్దానాలన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ట్వీట్‌ చేశారు. సుస్థిర ప్రభుత్వం కోసం వైసీపీకే ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు.

బీజేపీతో పొత్తు కోసం బేరసారాలు చేసేందుకు చంద్రబాబు నాయుడు అమిత్‌షా ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీతో పొత్తు కోసం ఆయన రాజీ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని గాలికొదిలేసిన బాబు.. తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ రాజీ పడ్డారని చెప్పారు.

బాబు పాకులాటపై విమర్శల వెల్లువ..

బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్న చంద్రబాబు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2018లో ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చానంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఇప్పుడు మళ్లీ ఎన్డీఏలో చేరడంలో మతలబు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రయోజనామా..? సొంత పార్టీ ప్రయోజనామా..? అంటూ నిలదీస్తున్నారు. మొన్నటిదాకా రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటూ ప్రగల్భాలు పలికిన బాబు.. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడి పొత్తు కోసం పాకులాడుతున్నారని మండిపడుతున్నారు.

First Published:  8 March 2024 8:17 AM GMT
Next Story