Telugu Global
Andhra Pradesh

లోకేష్ ఒక పెద్ద బఫూన్.. - వైసీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ విమ‌ర్శ‌

ఎన్టీఆర్‌ మనవడు, చంద్రబాబు కొడుకు, బ్రాహ్మణి భర్త గా తప్ప నీకు ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి.. అంటూ లోకేష్‌ని ఎద్దేవా చేశారు. కనీసం కర్ణాటక, ఆంధ్రా బోర్డర్ కూడా తెలియని వ్యక్తి లోకేష్ అని చెప్పారు.

లోకేష్ ఒక పెద్ద బఫూన్.. - వైసీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ విమ‌ర్శ‌
X

క‌నీసం న‌డ‌వ‌డం కూడా స‌రిగా చేత‌గాని నారా లోకేష్ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని విమ‌ర్శించ‌డం విడ్డూరంగా ఉంద‌ని వైసీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ విమ‌ర్శించారు. దేశంలో ఒకప్పుడు అత్యంత బలమైన నాయ‌కురాలు, కాంగ్రెస్ అధినేత్రి సోనియాను ఎదిరించిన నేత జగన్ అని ఆయ‌న గుర్తు చేశారు. గురువారం తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రిలో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. లోకేష్ ఒక పెద్ద బఫూన్ అని ఈ సంద‌ర్భంగా ఎంపీ విమ‌ర్శించారు. ఎన్టీఆర్‌ మనవడు, చంద్రబాబు కొడుకు, బ్రాహ్మణి భర్త గా తప్ప నీకు ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి.. అంటూ లోకేష్‌ని ఎద్దేవా చేశారు. కనీసం కర్ణాటక, ఆంధ్రా బోర్డర్ కూడా తెలియని వ్యక్తి లోకేష్ అని చెప్పారు.

పోల‌వ‌రాన్ని తుంగ‌లోకి తొక్కింది చంద్ర‌బాబే..

పోల‌వ‌రం ప్రాజెక్టును తుంగ‌లోకి తొక్కింది చంద్ర‌బాబే అని ఎంపీ మార్గాని భ‌ర‌త్ విమ‌ర్శించారు. టీడీపీ హ‌యాంలో పోల‌వ‌రంలో ప‌నుల‌న్నీ స‌గం స‌గ‌మే జ‌రిగాయ‌ని చెప్పారు. పోలవరంలో చంద్రబాబు చేసిన తప్పులను చూసి ఇప్పుడు కేంద్రం నిధులు మంజూరు చేయడం లేదని ఆయ‌న తెలిపారు. పోలవరం విషయంలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, అవాస్త‌వాలేన‌ని చెప్పారు. పోలవరం దగ్గర చిడతలు కొట్టించుకున్న ఘనత చంద్రబాబుదే అని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన తప్పిదాలతో రామాయపట్నం పోర్టు వెనక్కి పోయిందని గుర్తుచేశారు.

First Published:  16 Feb 2023 11:41 AM GMT
Next Story