Telugu Global
Andhra Pradesh

పవర్ స్టార్, లెజెండ్ మందు బ్రాండ్లు తెచ్చింది బాబే.. లిక్కర్ వ్యవహారంలో వైసీపీ సెటైర్లు

దత్తపుత్రుడి కోసం పవర్ స్టార్, వియ్యంకుడు కోసం లెజెండ్ అనే బ్రాండ్లను టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రవేశ పెట్టారని అన్నారు ఎమ్మెల్సీలు పోతుల సునీత, వరుదు కల్యాణి.

పవర్ స్టార్, లెజెండ్ మందు బ్రాండ్లు తెచ్చింది బాబే.. లిక్కర్ వ్యవహారంలో వైసీపీ సెటైర్లు
X

ఏపీలో అనుకోకుండా పొలిటికల్ సీన్ లిక్కర్ వ్యవహారంపైకి మళ్లింది. సంపూర్ణ మద్యపాన నిషేధం అనే వైసీపీ ఎన్నికల హామీ ఎంతవరకు, ఎప్పుడు అమలవుతుందో తెలియడంలేదు. అసలా హామీ ఇవ్వలేదని మంత్రి అమర్నాథ్ వంటివారు చెబుతున్నా.. గతంలో ఉన్న వీడియో సాక్ష్యాలు మార్ఫింగ్ అనిపించుకోలేక అలాగే మిగిలిపోయాయి. ఈ దశలో వైసీపీ నుంచి మహిళా ఎమ్మెల్సీలు టీడీపీని టార్గెట్ చేశారు. చంద్రబాబుది నారా ఫ్యామిలీ కాదు సారా ఫ్యామిలీ అంటూ మండిపడ్డారు.

దత్తపుత్రుడి కోసం పవర్ స్టార్, వియ్యంకుడు కోసం లెజెండ్ అనే బ్రాండ్లను టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రవేశ పెట్టారని అన్నారు ఎమ్మెల్సీలు పోతుల సునీత, వరుదు కల్యాణి. 200కు పైగా బ్రాండులు తెచ్చి ఏపీలో మద్యాన్ని ఏరులై పారించారని చంద్రబాబుపై మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడు, ఆదికేశవులు నాయుడు, యనమల కుటుంబాలకు డిస్టిలరీలను ఇచ్చి వ్యాపారం చేయించారని చెప్పారు. జగన్ హయాంలో అక్రమ మద్యానికి బ్రేక్ పడిందని చెప్పారు.

బి-3 గ్యాంగ్..

మద్యం విషయంలో మహిళా ఎమ్మెల్సీలు చేసిన కామెంట్లు కాస్త శృతి మించాయని అంటున్నారు. బి-3 గ్యాంగ్ అంటూ బాబు-భువనేశ్వరి-బ్రాహ్మణి కి పేరు పెట్టారు. సారా ఫ్యామిలీలో మగాళ్లు మందు లేనిదే బయటకొచ్చి మాట్లాడలేరని, మహిళలు కూడా మద్యం మత్తులో కొట్టుకుంటారని అన్నారు. వైఎస్ భార‌తిపై కామెంట్లు చేస్తే, మీ కుటుంబ సభ్యులను కూడా బజారు కీడుస్తామంటూ హెచ్చరించారు. అప్పట్లో లిక్కర్ డీలింగ్స్ అన్నీ చంద్రబాబు కుటుంబంలోని మహిళలే నిర్వహించారని విమర్శించారు.

ఏపీలో ఇప్పుడీ పొలిటికల్ కామెంట్స్ మరింత హాట్ హాట్ గా మారాయి. ఇప్పటి వరకూ వైసీపీలో మహిళా నాయకులు పెద్దగా బయటపడలేదు. రోజా సహా ఒకరిద్దరు మహిళా మంత్రులే కాస్త గట్టిగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా ఎదురుదాడి ప్రారంభించారు. కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తున్నారు. ఈ విమర్శల విపరీతం ఏ స్టేజ్ కి వెళ్తుందో చూడాలి.

First Published:  5 Sep 2022 3:33 AM GMT
Next Story