Telugu Global
Andhra Pradesh

విదేశీ విద్య కోసం కిడ్నీలు అమ్ముకుంటున్నారు - వైసీపీ ఎమ్మెల్సీ

అప్పటి ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చేదని.. ఇప్పుడు ప్రభుత్వం కోటి ఇచ్చినా ఈ కఠిన నిబంధనల కారణంగా ఉపయోగం లేకుండాపోతోందన్నారు. కొందరు పేదలు పిల్లల విదేశీ విద్య కోసం కిడ్నీలు, ఆస్తులు అమ్ముకుంటున్నారని రవీందర్ వివరించారు.

విదేశీ విద్య కోసం కిడ్నీలు అమ్ముకుంటున్నారు - వైసీపీ ఎమ్మెల్సీ
X

విదేశీ విద్య పథకం అర్హతకు విధించిన నిబంధనల పట్ల అధికార పార్టీ ఎమ్మెల్సీ పండుల రవీందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కఠిన నిబంధనలను పెట్టి ఈ పథకం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందకుండా చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయన్న కారణాన్ని చూపుతూ ప్రస్తుతం ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయడం వల్ల విద్యార్థులకు ఈ పథకం వల్ల ప్రయోజనం లేకుండాపోతోందన్నారు.

గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై నివేదికలో విద్యార్థులు ఒకదేశం పేరు చెప్పి మరో దేశంలో చదువుకున్నట్టుగా.. ఒక యూనివర్శిటీ పేరు చెప్పి మరో యూనివర్శిటీలో చదుకున్నట్టుగా మాత్రమే ఉందని.. ఎక్కడా డబ్బులు తీసుకెళ్లి దుర్వినియోగం చేసినట్టు తేలలేదని శాసనమండలిలో పండుల రవీందర్‌ వ్యాఖ్యానించారు. ఎక్కడో ఒక చోట చదువుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.

అప్పటి ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చేదని.. ఇప్పుడు ప్రభుత్వం కోటి ఇచ్చినా ఈ కఠిన నిబంధనల కారణంగా ఉపయోగం లేకుండాపోతోందన్నారు. కొందరు పేదలు పిల్లల విదేశీ విద్య కోసం కిడ్నీలు, ఆస్తులు అమ్ముకుంటున్నారని రవీందర్ వివరించారు. ప్రపంచంలోనే టాప్‌ 100 వర్శిటీల్లో సీటు సాధిస్తే కోటి, టాప్‌ 200 యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే 50 లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. కానీ ఎస్సీ, ఎస్టీ పిల్లలకు అలాంటి యూనివర్శిటీల్లో అవకాశం దొరకడం సాధ్యమా అని ప్రశ్నించారు. జలుబు చేసిందని, ముక్కు తీసేస్తే ఎలా అని ప్రశ్నించారు.

First Published:  21 Sep 2022 3:22 AM GMT
Next Story