Telugu Global
Andhra Pradesh

విషమంగా వైసీపీ ఎమ్మెల్సీ ఆరోగ్య పరిస్థితి

రెండు రోజులుగా వెంటిలేటర్‌పైనే వైద్యం అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లోని అల్వియోలార్‌ ఖాళీల్లో రక్తస్రావం కూడా అధికంగా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.

విషమంగా వైసీపీ ఎమ్మెల్సీ ఆరోగ్య పరిస్థితి
X

వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి ఆరోగ్యం విషమంగా ఉంది. కొద్దికాలంగా ఆయన కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. ఆదివారం నంద్యాల జిల్లా అవుకులోని తన ఇంట్లో తీవ్ర అనారోగ్యానికి గురవగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన దగ్గుతో ఆయన ఇబ్బందిపడ్డారు.

రెండు రోజులుగా వెంటిలేటర్‌పైనే వైద్యం అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లోని అల్వియోలార్‌ ఖాళీల్లో రక్తస్రావం కూడా అధికంగా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.

భగీరథ రెడ్డికి తొలుత వందశాతం వెంటిలేటర్ మీదే ఆక్సిజన్ అందించారని.. ఇప్పుడు పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉందని.. వైద్యానికి సహకరిస్తున్నారని ఆయన బంధువు రఘునాథరెడ్డి మీడియాకు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు చెప్పారు. భగీరథ రెడ్డి చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే రామకృష్ణారెడ్డి మరణించడంతో ఆ స్థానంలో భగీరథ రెడ్డికి జగన్ అవకాశం కల్పించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని కుటుంబ సభ్యులు కోరారు.

First Published:  2 Nov 2022 2:52 AM GMT
Next Story