Telugu Global
Andhra Pradesh

కోటంరెడ్డి.. నువ్వు మంత్రి అవుతావ్‌.. - నాగసాధువుల సడన్ ఎంట్రీ

ఎమ్మెల్యే దగ్గరకు వచ్చిన నాగసాధువులు జోస్యం చెప్పారు. నీకు ఇద్దరు కూతుర్లు కదా అంటూ ప్రశ్నించారు. అవును అని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. నీకు అంతా మంచే జరుగుతుంది. మంత్రి అవుతావ్‌ అంటూ నాగసాధువులు జోస్యం చెప్పారు.

కోటంరెడ్డి.. నువ్వు మంత్రి అవుతావ్‌.. - నాగసాధువుల సడన్ ఎంట్రీ
X

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. గణేష్‌ నిమజ్జనంపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా.. నాగసాధువులు అటుగా వచ్చారు. వారిని చూసిన ఎమ్మెల్యే లేచి నిలబడ్డారు.

ఎమ్మెల్యే దగ్గరకు వచ్చిన నాగసాధువులు జోస్యం చెప్పారు. నీకు ఇద్దరు కూతుర్లు కదా అంటూ ప్రశ్నించారు. అవును అని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. నీకు అంతా మంచే జరుగుతుంది. మంత్రి అవుతావ్‌ అంటూ నాగసాధువులు జోస్యం చెప్పారు. నాగసాధువుల ఆశీర్వాదానికి కోటంరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వారి పాదాలకు నమస్కారం చేశారు.

కోటంరెడ్డికి నాగసాధువులు జోస్యం చెప్పడంతో అక్కడున్న ఇతర నాయకులు వారి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా అంటూ అడిగారు. ఫోన్ నెంబర్‌ ఉందా అని సాధువులను ఆరా తీశారు.

మొన్నటి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సమయంలోనే మంత్రి పదవి వస్తుందని కోటంరెడ్డి ఆశించారు. రాకపోవడంతో కంటతడి కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు నాగసాధువుల ఆశీర్వాదం ఎప్పుడు ఫలిస్తుందో చూడాలి. తొలి నుంచి వైఎస్‌ జగన్‌ను నమ్ముకుని ఉన్న నేతగా కోటంరెడ్డికి పేరుంది.

First Published:  4 Sep 2022 1:37 AM GMT
Next Story