Telugu Global
Andhra Pradesh

నారా లోకేష్‌పై కొడాలి నాని ఫైర్

లోకేష్‌కి, చంద్ర‌బాబుకు ఈ సంద‌ర్భంగా కొడాలి నాని స‌వాల్ విసిరారు. నీ తాత ఖర్జూరనాయుడే అయితే.. నీ బాబు, నువ్వు దమ్ముంటే గన్నవరం, గుడివాడల్లో పోటీ చేయాలి.. అంటూ స‌వాల్ చేశారు.

నారా లోకేష్‌పై కొడాలి నాని ఫైర్
X

గ‌న్న‌వ‌రంలో జ‌రిగిన యువ‌గ‌ళం స‌భ‌లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. తాము అధికారంలోకొస్తే కొడాలి నానిని డ్రాయ‌ర్‌తో రోడ్ల‌పై న‌డిపిస్తానంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లపై గురువారం కొడాలి నాని స్పందించారు. లోకేష్ ఒక ప‌ప్పుగాడు, వెధ‌వ అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. లోకేష్ డైప‌ర్లు వేసుకున్న వ‌య‌సులోనే తాను పాద‌యాత్ర చేశాన‌ని చెప్పారు. వీడా మ‌మ్మ‌ల్ని డ్రాయ‌ర్ల మీద న‌డిపించేది అంటూ మండిప‌డ్డారు.

అంద‌రి పేర్లూ ఎర్ర డైరీలో రాసి ఉంచుతున్నానంటూ లోకేష్ చేసిన వ్యాఖ్య‌ల‌పైనా కొడాలి నాని స్పందించారు. 9 నెల‌ల త‌ర్వాత ఎర్ర బుక్కును చించుకుని బాబూ కొడుకులు మ‌డిచి కింద పెట్టుకోవాలంటూ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. త‌న‌ను, వంశీని త‌ల్లి పాలు తాగి రొమ్ము గుద్దామ‌ని అంటున్నాడ‌ని, కాంగ్రెస్‌లో రెండుసార్లు సీటిస్తే నీ బాబు చేసిందేంటో ద‌మ్ముంటే పోయి నీ బాబు చంద్ర‌బాబును అడుగు అంటూ నిల‌దీశారు.

అంతేకాదు.. లోకేష్‌కి, చంద్ర‌బాబుకు ఈ సంద‌ర్భంగా కొడాలి నాని స‌వాల్ విసిరారు. నీ తాత ఖర్జూరనాయుడే అయితే.. నీ బాబు, నువ్వు దమ్ముంటే గన్నవరం, గుడివాడల్లో పోటీ చేయాలి.. అంటూ స‌వాల్ చేశారు. నువ్వు మాతో పోయించడం కాదు.. నీతోనే ఉచ్చ పోయిస్తాం అని హెచ్చ‌రించారు. 2024 ఎన్నికలవ్వగానే ఎన్టీఆర్ వారసులు చంద్రబాబు, లోకేష్ ను తన్ని తరిమేస్తారని ఈ సంద‌ర్భంగా కొడాలి నాని స్ప‌ష్టం చేశారు.

*

First Published:  25 Aug 2023 2:07 AM GMT
Next Story