Telugu Global
Andhra Pradesh

పవన్ అధ్యక్షుడిగా ఉండడం జ‌న‌సైనికుల‌ ఖర్మ - ద్వారంపూడి

పవన్‌కల్యాణ్‌ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి చంద్రబాబు టిక్‌ పెట్టాలని.. పార్లమెంట్‌కు పోటీ చేయడానికి అమిత్ షా టిక్ పెట్టాలంటూ ఎద్దేవా చేశారు ద్వారంపూడి.

పవన్ అధ్యక్షుడిగా ఉండడం జ‌న‌సైనికుల‌ ఖర్మ - ద్వారంపూడి
X

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మరోసారి విరుచుకుపడ్డారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మంగళవారం పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే పవన్‌ పిఠాపురంలో పోటీ చేస్తున్నారని చెప్పారు ద్వారంపూడి.

పవన్‌కల్యాణ్‌ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి చంద్రబాబు టిక్‌ పెట్టాలని.. పార్లమెంట్‌కు పోటీ చేయడానికి అమిత్ షా టిక్ పెట్టాలంటూ ఎద్దేవా చేశారు ద్వారంపూడి. ఒక పార్టీ అధ్యక్షుడి ఉంటూ ఎన్నిక‌ల్లో పోటీ చేయడానికి మరో పార్టీకి చెందిన నాయకుల అనుమతి తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉండడం జ‌న‌సేన సైనికుల ఖర్మ అంటూ సెటైర్లు వేశారు.

వైసీపీ అభ్య‌ర్థులను గెలిపించేందుకు పార్టీ లీడర్లు, క్యాడర్‌ సిద్ధంగా ఉందన్నారు ద్వారంపూడి. పవన్‌కల్యాణ్‌ అనే వ్యక్తి మీద ప్రజలకు ఎలాంటి నమ్మకం లేదన్నారు. పవన్‌ మరోసారి ఓడిపోవడం ఖాయమన్నారు

First Published:  20 March 2024 7:12 AM GMT
Next Story