Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు అసెంబ్లీకి రావాలి.. వైసీపీ ర్యాగింగ్

గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. సమావేశాలు ఎన్నిరోజులు జరుపుతారనే విషయంపై అసెంబ్లీ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ సమావేశాలకు చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా హాజరవ్వాలని కోరారు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాద్‌ రాజు.

చంద్రబాబు అసెంబ్లీకి రావాలి.. వైసీపీ ర్యాగింగ్
X

ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి మొదలు కాబోతున్నాయి. ఈ సమావేశాలకు చంద్రబాబు హాజరు కావాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు అసెంబ్లీనుంచి తప్పించుకోడానికే ఆ రోజు ఏడుపు నాటకం ఆడారని, ఆ తర్వాతనుంచి అసెంబ్లీకి రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని పదే పదే వైసీపీ నేతలు ర్యాగింగ్ చేస్తున్నారు. సీఎం అయ్యే వరకు అసెంబ్లీలో అడుగే పెట్టనన్న బాబు, రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో ఎందుకు ఓటింగ్ కి హాజరయ్యారనే కామెంట్లు కూడా వినిపించాయి. కానీ చంద్రబాబు మాత్రం అసెంబ్లీ సమావేశాలను తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన సీఎం అయ్యే వరకు తాము కూడా అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తామన్న ఎమ్మెల్యేలు మాత్రం నామ్ కే వాస్తే గా సమావేశాలకు హాజరవుతున్నారు. సమావేశేలు జరిగినన్ని రోజులు నిరసన కార్యక్రమాలతో వార్తల్లో కనిపించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి మొదలు కాబోతున్నాయి. ఈ సమావేశాలకు చంద్రబాబు హాజరు కావాలని అంటున్నారు వైసీపీ నేతలు.

ఇటీవల అమరావతి యాత్రతో మరోసారి రాజధాని వ్యవహారం రచ్చకెక్కింది. అసెంబ్లీలో మూడు రాజధానులపై సమగ్ర చర్చ జరుపుతామంటున్నారు వైసీపీ నేతలు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కూడా చర్చ ఉంటుందని చెబుతున్నారు. దమ్ముంటే చంద్రబాబు సమావేశాలకు రావాలని సవాల్ విసురుతున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని వేలెత్తి చూపించే అవకాశం లేకపోవడం వల్లే చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నారని అంటున్నారు వైసీపీ నేతలు.

గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. సమావేశాలు ఎన్నిరోజులు జరుపుతారనే విషయంపై అసెంబ్లీ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ సమావేశాలకు చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా హాజరవ్వాలని కోరారు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాద్‌ రాజు. రేపు ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభం అవుతాయని, జీరో అవర్ తర్వాత అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అన్ని అంశాలపై చర్చ బాగా జరగాలనే ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పిన ప్రసాద్‌ రాజు, ప్రతిపక్షం లేవనెత్తే ప్రతి అంశంపై సమాధానం చెప్పటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

మూడు రాజ ధానుల బిల్లు..

తాజా సమావేశాల్లో అభివృద్ధి వికేంద్రీకరణపై కూడా ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్నారు చీఫ్ విప్ ప్రసాద్ రాజు. అవసరమైతే మూడు రాజధానుల బిల్లు సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పారు. అయితే బిల్లు ఎప్పుడు ప్రవేశపెడతారనేది సీఎం జగన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

First Published:  14 Sep 2022 8:11 AM GMT
Next Story