Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు చిప్‌ బాగా వీక్ అయింది - విజయసాయిరెడ్డి

కూటమి పార్టీల పరిస్థితిపైనా సెటైర్లు వేశారు విజయసాయి రెడ్డి. మూడు పార్టీలు కలిసినప్పటికీ.. ఏపీలో వారికి ఎక్కడా సానుకూల పరిస్థితులు కనిపించడం లేదన్నారు.

చంద్రబాబు చిప్‌ బాగా వీక్ అయింది - విజయసాయిరెడ్డి
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వరుస సెటైర్లు సంధిస్తున్నారు నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి. ఎన్నికల ప్రచారంలో మళ్లీ చంద్రబాబు హాస్య గుళికలు విసురుతున్నారంటూ ఎద్దేవా చేశారాయన. చంద్రబాబు చిప్‌ బాగా వీక్ అయిందన్నారు విజయసాయి.

ప్రచారంలో చంద్రబాబు చేసిన పలు కామెంట్లను తన ట్వీట్‌లో ప్రస్తావించారు విజయసాయిరెడ్డి. విద్యార్థులకు రిజర్వేషన్లు తెచ్చింది తానేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారని ..అక్కడితో ఆగకుండా అబ్బాయిలు ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి కూడా తానే తెచ్చానని బాబు గొప్పలకు పోతున్నారంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు. గతంలో బ్రిటిష్ వారిపై పోరాడి స్వాతంత్రం తెచ్చానని చంద్రబాబు బాంబు పేల్చారని.. ఆ షాక్ నుంచి తేరుకోకముందే మళ్లీ చంద్రబాబు కామెడీ మొదలు పెట్టారంటూ ట్వీట్ చేశారు.


కూటమి పార్టీల పరిస్థితిపైనా సెటైర్లు వేశారు విజయసాయి రెడ్డి. మూడు పార్టీలు కలిసినప్పటికీ.. ఏపీలో వారికి ఎక్కడా సానుకూల పరిస్థితులు కనిపించడం లేదన్నారు. 60 నుంచి 70 స్థానాల్లో సొంత పార్టీ నేతలే చొక్కాలు పట్టుకుంటున్నారంటూ కూటమి పరిస్థితిని వివరించారు. కుమ్ములాటలు ఇప్పటికే చేయిదాటిపోయాయని.. బుజ్జగింపుల పేరిట తిరుగుబాటు నేతలకు కోట్లు ఆఫర్ చేస్తున్నా.. బాబు జిత్తులు ఫలించడం లేదన్నారు విజయసాయిరెడ్డి.

నిన్నటిదాకా పల్లకీ మోసినవారే ఇవాళ కిందపడేసి పోతుండడంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని.. ఆ ఒత్తిడితోనే ప్రచార సభల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారని కామెంట్ చేశారు. బాబు ప్రచారానికి వస్తే లాభం కంటే నష్టమే ఎక్కువని తెలుగుదేశం అభ్యర్థులు తలలు పట్టుకున్నారంటూ విజయసాయి సెటైర్లు వేశారు.

First Published:  7 April 2024 7:51 AM GMT
Next Story