Telugu Global
Andhra Pradesh

చెప్పులు చూపించి పవన్‌కు వార్నింగ్

పదేళ్లుగా ఒక్కడినే జనసేనను నడుపుతున్నానని ప‌వ‌న్‌ చెబుతున్నాడ‌ని.. అసలు జ‌న‌సేన‌ పార్టీ ఆఫీస్‌ స్థలం ఎవరు ఇచ్చారు, దాని రేటు ఎంత అన్నది ప్రపంచానికి తెలియదా అని పేర్ని నాని ప్రశ్నించారు.

చెప్పులు చూపించి పవన్‌కు వార్నింగ్
X

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని గట్టి కౌంటర్ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్ పదే పదే వైసీపీ నేతలకు చెప్పులు చూపించా అంటున్నాడ‌ని.. చెప్పులు చూపిస్తే మొనగాడు అయిపోతారా అని ప్రశ్నించారు. చెప్పులు చూపిస్తే పోటుగాళ్లు అయితే తాను రెండు చెప్పులు చూపిస్తా అంటూ ప్రెస్‌మీట్‌లో త‌న కాళ్ల‌కున్న‌ రెండు చెప్పులను పేర్నినాని చూపించారు. చెప్పులు చూపిస్తే మడిచి పడుకోబెడుతామని వార్నింగ్ ఇచ్చారు. చెప్పుతో కొడితే మక్కెలిరిచేస్తామని హెచ్చరించారు.

పదేళ్లుగా ఒక్కడినే జనసేనను నడుపుతున్నానని ప‌వ‌న్‌ చెబుతున్నాడ‌ని.. అసలు జ‌న‌సేన‌ పార్టీ ఆఫీస్‌ స్థలం ఎవరు ఇచ్చారు, దాని రేటు ఎంత అన్నది ప్రపంచానికి తెలియదా అని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు డబ్బులు ఇస్తుంటే ప‌వ‌న్ పార్టీని నడుపుతున్నాడ‌ని ఫైర్ అయ్యారు. ప్రజలకు జగన్‌ సొంత డబ్బులు ఇస్తున్నారా అని మాట్లాడుతున్న పవన్‌ కల్యాణ్.. మరి చంద్రబాబుతో కలిసి అధికారం ఏర్పాటు చేస్తే ఇంట్లో డబ్బులతో పథకాలు అమలు చేస్తారా అని ప్రశ్నించారు.

ఇదే చంద్రబాబు గతంలో నేను వేసిన రోడ్లు అంటూ మాట్లాడినప్పుడు మీ ఇంట్లో డబ్బులతో వేశావా అని ప‌వ‌న్‌ ఎందుకు ప్రశ్నించలేదని పేర్నినాని నిలదీశారు. ఏపీ మీద ప‌వ‌న్‌కు అంత గౌరవం ఉంటే.. హరీష్‌ రావు ఏపీని తిడుతుంటే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గులాబీ జెండాను జేబులో పెట్టుకుని హైదరాబాద్‌లో తిరుగుతున్నవాడు ఎవడు అని ఫైర‌య్యారు. తన తల్లిని అవమానించిన టీడీపీని, లోకేష్‌ను ఎప్పటికీ క్షమించబోనని చెప్పిన పవన్‌ కల్యాణ్ ఇప్పుడు తిరిగి వారితోనే ఎలా చేతులు క‌లుపుతున్నాడ‌ని ప్రశ్నించారు. అమరావతి కమ్మవారి గేటెడ్‌ కమ్యూనిటీ అని ఇదే పవన్‌ కల్యాణ్ మాట్లాడలేదా అని గుర్తుచేశారు.

First Published:  15 Jun 2023 8:55 AM GMT
Next Story