Telugu Global
Andhra Pradesh

బాబుపై బెజవాడలో పాత పత్రికలతో ప్రచారం

ఎన్టీఆర్‌ అవసరం టీడీపీకి లేదంటూ డెక్కన్ క్రానికల్ పత్రికకు గ‌తంలో చంద్ర‌బాబు ఇచ్చిన ఇంటర్వ్యూ పేపర్ క్లిప్పింగ్‌లను విజయవాడ ఐటీసీ కాలేజీ, శారద కాలేజీ తదితర ప్రాంతాల్లో భారీగా అతికించారు.

బాబుపై బెజవాడలో పాత పత్రికలతో ప్రచారం
X

హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్పు నేపథ్యంలో ఎన్టీఆర్‌పై ఎవరికి నిజమైన గౌరవం ఉందన్న దానిపై అటు ప్రతిపక్షం, ఇటు అధికారం పక్షం పరస్పరం మాటల దాడి చేసుకుంటున్నాయి. వైసీపీ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి నాడు పత్రికల్లో వచ్చిన కథనాలను చంద్రబాబుపైకి ప్రయోగిస్తోంది.


విజయవాడలో కొందరు వైసీపీ శ్రేణులు.. ఎన్టీఆర్‌ను గద్దె దించే సమయంలో చంద్రబాబు పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలకు సంబంధించిన క‌థ‌నాల‌ను ప్రింట‌వుట్లు తీసి పలు ప్ర‌ధాన కూడళ్ల‌లో ప్ర‌ద‌ర్శించారు.


ఎన్టీఆర్‌ అవసరం టీడీపీకి లేదంటూ డెక్కన్ క్రానికల్ పత్రికకు గ‌తంలో చంద్ర‌బాబు ఇచ్చిన ఇంటర్వ్యూ పేపర్ క్లిప్పింగ్‌లను విజయవాడ ఐటీసీ కాలేజీ, శారద కాలేజీ తదితర ప్రాంతాల్లో భారీగా అతికించారు. ఇప్పటికే సోషల్ మీడియాలోనూ నాటి సంగతులపై అప్పట్లో వచ్చిన కథనాలను వైసీపీ వారు వైరల్ చేస్తున్నారు.

First Published:  25 Sep 2022 2:33 PM GMT
Next Story