Telugu Global
Andhra Pradesh

ఆ ఫ్యాన్సీ నంబ‌ర్‌ ధ‌ర రూ.122 కోట్లు

ప్ర‌పంచ వ్యాప్తంగా ఆక‌లితో అల‌మ‌టిస్తున్న ప్ర‌జ‌ల కోసం ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ వేలం ద్వారా వ‌చ్చిన ఆదాయం మొత్తం `వ‌న్ బిలియ‌న్ మీల్స్` పేరుతో నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మానికి వెళుతుందని అధికారులు తెలిపారు.

ఆ ఫ్యాన్సీ నంబ‌ర్‌ ధ‌ర రూ.122 కోట్లు
X

ఓ కారు ఫ్యాన్సీ నంబ‌ర్ ధ‌ర రికార్డు స్థాయిలో ప‌లికింది. ఏకంగా రూ.122 కోట్ల‌కు ఆ నంబ‌ర్ అమ్ముడుపోయింది. గ‌త రికార్డుల‌ను బ‌ద్దలుకొట్టి టాప్ ప్లేస్‌కి చేరింది. దుబాయ్‌లో `మోస్ట్ నోబుల్ నంబ‌ర్స్‌` పేరుతో కారు, మొబైల్ నంబ‌ర్ల‌కు ఈ వేలం నిర్వ‌హించారు. ఫ్రెంచ్ - ఎమిరాటీ వ్యాపార‌వేత్త‌, టెలిగ్రామ్ యాప్ వ్య‌వ‌స్థాప‌కుడు పావెల్ వాలెరివిచ్ దురోవ్‌.. ఈ వేలంలో 55 మిలియ‌న్ దిర్హామ్‌ల (దాదాపు రూ.122 కోట్లు) కు ఈ నంబ‌రును కొనుగోలు చేశారు. ఇంత రికార్డ్ ధ‌ర ప‌లికిన ఆ నంబ‌ర్‌.. `పీ 7`.

వేలం సాగిందిలా..

ఈ వేలంలో ప్రారంభ ధ‌ర 15 మిలియ‌న్ దిర్హామ్‌లు (దాదాపు రూ.33.5 కోట్లు)గా నిర్ణ‌యించారు. వేలం ప్రారంభ‌మైన త‌ర్వాత కొద్దిసేప‌టికి 25 మిలియ‌న్ దిర్హామ్‌ల‌కు చేరుకొని కొద్దిసేపు స్త‌బ్దుగా నిలిచిపోయింది. ఆ త‌ర్వాత 30 మిలియ‌న్ దిర్హామ్‌ల‌కు.. ఆ వెంట‌నే 55 మిలియ‌న్ దిర్హామ్‌ల‌కు చేరుకుంది. 2008లో అబుదాబిలో జ‌రిగిన వేలంలో నంబ‌ర్ .. 1 .. ధ‌ర 52.2 మిలియ‌న్ దిర్హామ్‌లు (దాదాపు రూ.116.5) ప‌లికింది. ఇప్ప‌టివ‌ర‌కు అదే రికార్డు ధ‌ర కాగా.. దానిని అధిగ‌మించి `పీ 7` రికార్డు ధ‌ర న‌మోదు చేసింది. ఈ వేలంలో మ‌రిన్ని నంబ‌ర్ల‌ను వేలం వేశారు. ఈ వేలం ద్వారా మొత్తం 100 మిలియ‌న్ దిర్హామ్‌లు (దాదాపు రూ.223 కోట్లు) స‌మ‌కూరిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు.

అన్నార్తుల ఆక‌లి తీర్చేందుకే..

ప్ర‌పంచ వ్యాప్తంగా ఆక‌లితో అల‌మ‌టిస్తున్న ప్ర‌జ‌ల కోసం ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ వేలం ద్వారా వ‌చ్చిన ఆదాయం మొత్తం `వ‌న్ బిలియ‌న్ మీల్స్` పేరుతో నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మానికి వెళుతుందని అధికారులు తెలిపారు. రంజాన్ ఉదార స్ఫూర్తికి అనుగుణంగా వ‌న్ బిలియ‌న్ మీల్స్ ఎండోమెంట్ కార్య‌క్ర‌మాన్ని దుబాయ్ పాల‌కుడు షేక్ మ‌హ‌మ్మ‌ద్ బిన్ ర‌షీద్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.

First Published:  11 April 2023 2:33 AM GMT
Next Story