Telugu Global
Andhra Pradesh

ఎల్లోబ్యాచ్ పరువంతా పోయిందా..?

ఈనెల 19వ తేదీ నుంచి యూఏఈ వేదికగా టీ-20 లీగ్ మొదలవ్వబోతోంది. ఈ టోర్నమెంటులో అంబటి ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సో, టీ-20 నిబంధనల ప్రకారమే అంబటి వైసీపీకి రాజీనామా చేసిన విషయం అర్థ‌మవుతోంది.

ఎల్లోబ్యాచ్ పరువంతా పోయిందా..?
X

ఎల్లోబ్యాచ్ పరువంతా ఒక్కసారిగా పోయింది. వైసీపీలో చేరిన పదిరోజుల్లోపే అంబటి రాయడు రాజీనామా చేసేశారు. ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి దెబ్బకు అంబటి రాజీనామా చేసేశారని చంద్రబాబు అండ్ కో గోల మొదలుపెట్టేశారు. దాన్ని వెంటనే ఎల్లోమీడియా అందుకుంది. ఇటు టీడీపీ, అటు ఎల్లోమీడియా కలిసిపోయి ఏకకాలంలో జగన్ పైన ఎంత బురదచల్లాలో అంతా చ‌ల్లేశారు. గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తానని ఆశచూపించి అంబటిని జగన్ వైసీపీలోకి లాక్కున్నాడంటూ చంద్రబాబు గోల గోలచేశారు.

అంబటి పార్టీలో చేరిన తర్వాత గుంటూరు సీటును నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు ఆఫర్ చేయటంతో మనస్తాపం చెందటంతో పార్టీకి రాజీనామా చేసినట్లు రకరకాల కథనాలు అల్లేసింది. ఎల్లోమీడియా ఛాన‌ల్లో అంబటి విషయంలో జగన్ కు వ్యతిరేకంగా ప్రత్యేకంగా డిబేట్లే నడిచాయి. సీన్ కట్ చేస్తే తాను వైసీపీకి ఎందుకు రాజీనామా చేశాననే విషయాన్ని అంబటే స్వయంగా ప్రకటించారు. అంబటి ట్వీట్ ప్రకారం టీ-20 టోర్నమెంట్లలో ఆడే ఆటగాళ్ళకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధాలు ఉండకూడదనే నిబంధనుంది.

ఈనెల 19వ తేదీ నుంచి యూఏఈ వేదికగా టీ-20 లీగ్ మొదలవ్వబోతోంది. ఈ టోర్నమెంటులో అంబటి ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సో, టీ-20 నిబంధనల ప్రకారమే అంబటి వైసీపీకి రాజీనామా చేసిన విషయం అర్థ‌మవుతోంది. అంబటి రాజీనామా ఎందుకు చేశాడన్న విషయాన్ని ఎల్లోమీడియా ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా జగన్ పై బురదచల్లేయటానికి ఉపయోగించుకున్నది. అంబటి వైసీపీకి రాజీనామా చేయగానే జగన్ వేధింపులు తట్టుకోలేకే రాజీనామా చేసినట్లు టన్నులకొద్ది బురదను చల్లేసింది. అయితే ఇలాంటి నిబంధన ఉన్నప్పుడు అంబటి అసలు వైసీపీలో ఎందుకు చేరాడన్నదే అర్థంకావటంలేదు.

ఇదే పద్దతిలో ఆదివారం ఎల్లోమీడియా రేవంత్ తో ఇంటర్వ్యూను ప్రచురించింది. తాను ముఖ్యమంత్రయిన తర్వాత అభినందించటానికి జగన్ కనీసం ఫోన్ కూడా చేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించటాన్ని పెద్దగా హైలైట్ చేసింది. అయితే ఇంతకుముందు ఒక ప్రత్యేక కథనంలో రేవంత్ ను అభినందించటానికి జగన్ మూడుసార్లు ఫోన్ చేస్తే మాట్లాడటానికి రేవంత్ నిరాకరించినట్లు గొప్పగా చెప్పింది. అంటే జగన్ను రేవంత్ లెక్కేచేయలేదు అన్న అర్థం వచ్చేట్లు బిల్డప్ ఇవ్వటానికే అలా చెప్పారు. ఇప్పుడేమో జగన్ తనకు ఫోన్ చేయలేదని అనటాన్ని ప్రముఖంగా అచ్చేశారు. ఇలాంటి బుర్రకుతోచిన కథనాలు అచ్చేస్తున్నందుకే ఎల్లోమీడియా పరువు పోగొట్టుకుంటోంది.

First Published:  8 Jan 2024 5:28 AM GMT
Next Story