Telugu Global
Andhra Pradesh

వైసీపీ ఫుల్లు అఫెన్సులోకి దిగేసిందా..?

చంద్రబాబునాయుడు డైరెక్షన్లోనే వివేకా కూతురు సునీత ఏడుసార్లు తన స్టెట్మెంట్లను మార్చినట్లు సజ్జల చెప్పారు. వివేకా హత్య వల్ల లాభం ఎవరికన్న విషయం అందరికి తెలిసినా సీబీఐ మాత్రం వింత పోకడలు పోయిందని మండిపడ్డారు.

వైసీపీ ఫుల్లు అఫెన్సులోకి దిగేసిందా..?
X

వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన ఫైనల్ చార్జిషీటుతో అవినాష్, వైసీపీకి బాగా ధైర్యమొచ్చేసినట్లుంది. అందుకనే ముందు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఇప్పుడు వైసీపీ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి ఫుల్లు అఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. వివేకా హత్యకేసు దర్యాప్తు జరిగిన విధానం, దర్యాప్తులో అప్పటి ఎస్పీ రామ్ సింగ్ వ్యవహరించిన విధానం, తనకు ఎలాంటి సంబంధంలేకపోయినా ఇరికించటం వంటి తదితర విష‌యాలపై సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు అవినాష్‌రెడ్డి 96 పేజీల లేఖరాశారు.

దర్యాప్తును ఉద్దేశ్యపూర్వకంగా దారి మళ్ళించి తన ఇమేజికి భంగం కలిగించిన రామ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. సరే అవినాష్ లేఖపై సీబీఐ డైరెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇక మంగళవారం మీడియా సమావేశం పెట్టిన సజ్జల కూడా సీబీఐనే టార్గెట్ చేశారు. దర్యాప్తు ఎలా జరగకూడదు అనేందుకు వివేకా కేసులో సీబీఐ వైఖరే ఉదాహరణగా నిలిచిందని ఎద్దేవా చేశారు. వివేకా హత్యకు కారణాలు, ఆధారాలన్నీ ఒకవైపుంటే సీబీఐ దర్యాప్తు మాత్రం మరోవైపు జరిగిందన్నారు.

చంద్రబాబునాయుడు డైరెక్షన్లోనే వివేకా కూతురు సునీత ఏడుసార్లు తన స్టెట్మెంట్లను మార్చినట్లు సజ్జల చెప్పారు. వివేకా హత్య వల్ల లాభం ఎవరికన్న విషయం అందరికి తెలిసినా సీబీఐ మాత్రం వింత పోకడలు పోయిందని మండిపడ్డారు. చంద్రబాబు వ్యవస్థ‌లను మ్యానేజ్ చేయటం వల్లే సీబీఐ దర్యాప్తు ఇంత ఘోరంగా జరిగిందన్నారు. జరిగిన హత్య రాజకీయ కారణాల వల్ల కాదని కుటుంబ తగాదాలు, ఆస్తుల గొడవల వల్లే జరిగిందన్నారు. తాను, వైఎస్ భారతి కలిసి ఎప్పుడూ సునీత ఇంటికి వెళ్ళలేదన్నారు.

సీబీఐ మీద అవినాష్, సజ్జల ఇంత ధైర్యంగా ఎదురుదాడి దిగటానికి సీబీఐ ఫైనల్ చార్జిషీటే కారణం. గూగుల్ టేక్ ఔట్ రీడింగ్ లో పొరబడ్డామని సీబీఐ ఫైనల్ చార్జిషీట్లో అంగీకరించిన విషయం తెలిసిందే. దాంతోనే అవినాష్ కు ధైర్యం వచ్చేసింది. ఎందుకంటే గూగుల్ టేక్ ఔట్ ఆధారంగానే అవినాష్ పై సీబీఐ కేసు పెట్టింది. ఇప్పుడా టెక్నాలజీయే తప్పని సీబీఐ అంగీకరించిన తర్వాత తనమీద కేసు నిలవదని అవినాష్ కు అర్థ‌మైపోయింది. అందుకనే ఒక్కసారిగా వీళ్ళంతా అఫెన్సివ్ మోడ్ లోకి దిగేశారు.

First Published:  26 July 2023 6:03 AM GMT
Next Story