Telugu Global
Andhra Pradesh

ఇప్పటికైనా భ్రమల్లో నుండి బయటకు వస్తారా?

చంద్రబాబు అరెస్టుతో టీడీపీ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని తమ్ముళ్ళు సంబరపడుతుంటే టైమ్స్ నౌ సర్వే అందుకు విరుద్ధంగా ఉంది.

ఇప్పటికైనా భ్రమల్లో నుండి బయటకు వస్తారా?
X

స్కిల్ స్కామ్‌లో చంద్రబాబునాయుడు అరెస్టయిన దగ్గర నుండి తమ్ముళ్ళతో పాటు ఎల్లోమీడియా కూడా భ్రమల్లో బతికేస్తోంది. అదేమిటంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని. ఎలాగంటే చంద్రబాబు అరెస్టుతో జనాల్లో టీడీపీపై సింపతి పెరిగిపోయిందట. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 73 ఏళ్ళ వయసు ఉన్న‌ చంద్రబాబును అన్యాయంగా కేసులో ఇరికించి జైల్లో వేసిందని జనాలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఎల్లోమీడియా విపరీతంగా ఊదరగొడుతోంది. ప్రతిరోజు చంద్రబాబుకు మద్దతుగా పేజీలకు పేజీలు వార్తాకథనాలను వండి వారుస్తోంది.

చంద్రబాబుకు మద్దతుగా జరుగుతున్న ఆందోళనల్లో అత్యధికం స్టేజ్ మేనేజ్‌మెంట్ అని అందరికీ తెలుసు. మీడియా గనుక నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే అప్పుడు బయటపడుతుంది టీడీపీ అసలు వ్యవహారం. సరే, ఈ విషయాలను పక్కనపెట్టేస్తే తాజాగా టైమ్స్ నౌ-ఈటీజీ సర్వే ఫ‌లితాలు సంచ‌ల‌నంగా మారాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత పై సంస్థ‌లు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి జనాభిప్రాయాలను సేకరించాయి. అందులో వైసీపీ 24 లేదా 25 ఎంపీ సీట్లలో గెలుస్తుందని తేలింది. టీడీపీకి వస్తే ఒక సీటు రావచ్చని తేలింది. జనసేనకు ఒక్క సీటు కూడా రాదని అర్థ‌మైపోయింది.

రాబోయే ఎన్నికల్లో జనసేనకు ఓట్ల శాతం పెరుగుతుంది కానీ ఒక్కసీటు గెలుచుకునే అవకాశం కూడా లేదని తేలింది. సర్వే ఫలితాలపై సుమారు 6 నిమిషాల వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని తమ్ముళ్ళు సంబరపడుతుంటే టైమ్స్ నౌ సర్వే అందుకు విరుద్ధంగా ఉంది.

కారణం ఏమిటంటే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే జైలుకు వెళ్ళారని జనాలు బలంగా నమ్ముతున్నారట. చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపారని జనాలు అనుకోవటంలేదని సర్వేలో తేలింది. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు. సాఫ్ట్‌వేర్‌తో పాటు హార్డ్‌వేర్ రంగం కూడా మెల్లిగా అభివృద్ధి చెందుతోంద‌ని జనాలు నమ్ముతున్నారట. ఇచ్చిన హామీలను జగన్ సంపూర్ణంగా నెరవేరుస్తున్నారని ఎక్కువ మంది జనాలు చెప్పారట. రాబోయే ఎన్నికల్లో వైసీపీ 51.10 శాతం ఓటు షేర్‌తో తిరుగులేని విజయం సాధిస్తుందని సర్వేలో తేలింది. కాబట్టి తాజా సర్వేతో అయినా తమ్ముళ్ళు, ఎల్లోమీడియా భ్రమల్లో నుండి బయటకు వస్తారా?


First Published:  3 Oct 2023 5:52 AM GMT
Next Story