Telugu Global
Andhra Pradesh

రామోజీ మీడియా ముందుకు ఎందుకు రావటంలేదు?

మార్గదర్శిలో చందాదారుల సంక్షేమం కోసమంటూ కొన్ని అంశాలతో ప్రభుత్వం ఆదివారం ప్ర‌క‌ట‌న‌లు జారీ చేసింది. దానికి సమాధానంగా రామోజీకి తన మీడియాలో వాటికి సమాధానాలిచ్చుకున్నారు.

రామోజీ మీడియా ముందుకు ఎందుకు రావటంలేదు?
X

మార్గదర్శికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకున్నా వెంటనే తన మీడియాలో వార్తలు, కథనాలు రాసుకుంటున్నారు. ప్రభుత్వం ఉద్దేశ‌పూర్వకంగానే దాడులు చేస్తోందని, చందాదారులను భయపెడుతోందని, తమ విశ్వసనీయతను దెబ్బకొడుతోందంటూ గగ్గోలు పెట్టేస్తున్నారు. మార్గదర్శిలో చందాదారుల సంక్షేమం కోసమంటూ కొన్ని అంశాలతో ప్రభుత్వం ఆదివారం ప్ర‌క‌ట‌న‌లు జారీ చేసింది. దానికి సమాధానంగా రామోజీకి తన మీడియాలో వాటికి సమాధానాలిచ్చుకున్నారు.

మార్గదర్శి యాజమాన్యం నియమ, నిబంధనలను ఉల్లంఘించిందని ప్రభుత్వం ప్ర‌క‌ట‌న‌లో స్పష్టంగా చెప్పింది. ఇప్పుడే కాదు చాలాకాలంగా ప్రభుత్వం ఇదే చెబుతోంది. దానిపై రామోజీ ‘ఉల్లంఘనలు అబద్ధం..ప్రభుత్వ దాడి నిజం’ అంటు రిజాయిండర్ లాంటి వార్తను ఫ్రంట్ పేజీలో అచ్చేసుకుంది. దానికి కొన‌సాగింపుగా లోపల పేజీల్లో పెద్ద వార్త రాసుకుంది. అందులో ఏమిటేమిటో అంశాలను ప్రస్తావించింది. ఇంతపెద్ద వార్తలు, కథనాలను అచ్చేసుకుంటున్న రామోజీ మార్గదర్శి వ్యాపారంలో ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదని చెప్పలేదు. ఎంతసేపు కోర్టు తీవ్రమైన చర్యలను వద్దన్నా ప్రభుత్వం ఆదేశాలను ఉల్లంఘించిందనే చెబుతున్నారు.

అసలు మార్గదర్శి వ్యాపారమే చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని, ఏ చట్టం ప్రకారం మార్గదర్శి చిట్ ఫండ్స్ నడుపుతున్నారో రామోజీ స్పష్టం చేయటంలేదని సీఐడీ అధికారులు పదేపదే చెబుతున్నారు. హిందూ అవిభాజ్య కుటుంబం ప్రకారం తీసుకున్నా, చిట్ ఫండ్స్ యాక్ట్ ప్రకారం తీసుకున్నా, కంపెనీల చట్టం ప్రకారం చూసినా రామోజీ వ్యాపారమే చేయకూడదని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు.

అయితే తాను ఏ చట్టం ప్రకారం వ్యాపారం మొదలుపెట్టాననే విషయాన్ని రామోజీ ఇంతవరకు స్పష్టం చేయలేదు. చిట్ ఫండ్స్ డిపాజిట్లను చిట్టేతర వ్యాపారాలకు మళ్ళించింది నిజమే అని విచారణలో ఒప్పుకున్నట్లు అధికారులు చెప్పారు. మరిది చిట్ ఫండ్ చట్టం నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదా? ప్రతి చందాదారుడికి ఒక బ్యాంకు ఖాతాను ఓపెన్ చేయాల్సిన రామోజీ అలా చేయలేదని ఆధారాలతో సహా అధికారులు బయటపెట్టింది నిజమే కదా.

చందాదారుల డబ్బును ఎక్కడి బ్రాంచీల్లో అక్కడే ఉంచాల్సిన రామోజీ మొత్తం డబ్బును కార్పొరేట్ ఆఫీసుకు తరిలించింది నిజమే కదా. చందాదారుల నుండి డిపాజిట్లు సేకరిస్తున్నట్లు కూడా బయటపడింది కదా. అసలు అధికారులు మీడియా సమావేశాలు పెట్టినట్లుగా తాను ఎందుకని మీడియా ముందుకు రాలేకపోతున్నారో రామోజీ చెప్పగలరా?

First Published:  31 July 2023 5:21 AM GMT
Next Story