Telugu Global
Andhra Pradesh

RRR మూవీని అభినందించిన జగన్ పై ఆ సింగర్ కు కోపమెందుకు వచ్చింది?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా RRR టీంకు అభినందనలు చెప్తూ ప్రకటన విడుదలచేశారు. వినోద రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు ఒక తెలుగు చిత్రానికి దక్కడం తెలుగు వారికి గర్వకారణమని, ప్రపంచ వేదికపై తెలుగు జెండా రెపరెపలాడుతుందని ముఖ్యమంత్రి కొనియాడారు.

RRR మూవీని అభినందించిన జగన్ పై ఆ సింగర్ కు కోపమెందుకు వచ్చింది?
X

RRR మూవీ లోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు వచ్చిన సందర్భంగా దేశవ్యాప్తంగా RRR మూవీ టీం పై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ మొదలు కొని ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు RRR టీం ను అభినందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా RRR టీంకు అభినందనలు చెప్తూ ప్రకటన విడుదలచేశారు. వినోద రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు ఒక తెలుగు చిత్రానికి దక్కడం తెలుగు వారికి గర్వకారణమని, ప్రపంచ వేదికపై తెలుగు జెండా రెపరెపలాడుతుందని ముఖ్యమంత్రి కొనియాడారు.

ఈ ప్రకటన ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అద్నామ్ సమీకి కోపం తెప్పించిది. జగన్ పై విమర్శలు ఎక్కుపెడుతూ ట్వీట్ చేశారు.

ముందుగా మనం భారతీయులమని, మమ్ములను మిగతా దేశం నుండి విడదీయవద్దని, ముఖ్యమంత్రి అనుసరిస్తున్న వేర్పాటువాద వైఖరి అనారోగ్యకరమని విమర్శించారు.

''తెలుగు జెండానా? భారత జెండానా? మనము ముందుగా భారతీయులం . కాబట్టి దయతో మిమ్మల్ని మిగిలిన దేశం నుండి వేరు చేసుకోకండి...ముఖ్యంగా అంతర్జాతీయంగా చూసినప్పుడు మనము ఒకే దేశం!

1947లో జరిగినట్టుగా ఈ ‘వేర్పాటువాద’ వైఖరి అత్యంత అనారోగ్యకరమైనది!!!ధన్యవాదాలు…జై హింద్! '' అని ట్వీట్ చేశాడు అద్నామ్ సమీ.అయితే అద్నామ్ సమీ ట్వీట్ పై నెటిజనులు విరుచుకపడుతున్నారు.


Next Story