Telugu Global
Andhra Pradesh

ఇద్దరిలో ఎవరి నమ్మకం గెలుస్తుంది?

రాజకీయంగా వైసీపీ-టీడీపీ, జనసేన మధ్య గొడవలు ఎన్నిజరుగుతున్నా తమకు సంబంధం లేదన్నట్లుగానే జనాలు చూస్తున్నారు. ప్రభుత్వం వల్ల తమకు లబ్ది జరిగిందని అనుకుంటే జగన్‌కు రెండోసారి అధికారం ఖాయం. లేకపోతే ఓట్లలో చీలిక తప్పదు. అప్పుడెవరు లాభపడతారో చూడాలి.

ఇద్దరిలో ఎవరి నమ్మకం గెలుస్తుంది?
X

రాబోయే ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్ చేసేది సింగిల్ పాయింట్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి ఒంటరి పోరాటానికి రెడీ అయిపోయారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పొత్తులు లేకుండా జగన్‌ను ధీటుగా ఎదుర్కోలేమని డిసైడ్ అయ్యారు. అందుకనే జనసేన+బీజేపీ జట్టులోకి తాను కూడా చేరాలని చంద్రబాబు తెగ ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబును చేర్చుకోవటానికి బీజేపీ ఇష్టపడటం లేదు. ఇక్కడే ఏమిచేయాలో చంద్రబాబు, పవన్‌కు అర్ధంకావటం లేదు.

పొత్తులు, ఎత్తులు వంటి విషయాలను పక్కనపెట్టేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను సింగిల్ పాయింట్ మాత్రమే డిసైడ్ చేస్తుందని చంద్రబాబు, పవన్ మరచిపోతున్నారు. ఇంతకీ ఆ సింగిల్ పాయింట్ ఏమిటంటే జగన్ ఏమో పాజిటివ్ ఓటింగ్‌ను నమ్ముకున్నారు. మిగిలిన ఇద్దరేమో నెగిటివ్ ఓట్లను మాత్రమే నమ్ముకున్నారు. జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటున్నారు. దీనికి ఆధారం ఏమిటో మాత్రం చెప్పలేకపోతున్నారు. మూడున్నరేళ్ళ పాలనలో మంచి జరిగిందని అనుకుంటేనే తనకు ఓట్లేసి మళ్ళీ గెలిపించమని జగన్ పదే పదే జనాలను అడుగుతున్నారు.

ప్రతిపక్షాలు చెప్పేది, ఎల్లో మీడియా రాతలను పట్టించుకోవద్దంటున్నారు. మీ కుటుంబానికి తన ప్రభుత్వం వల్ల మంచి జరిగిందా లేదా అన్నది ఆత్మపరిశీలన చేసుకోవాలని జగన్ జనాలను కోరుతున్నారు. తన వల్ల కుటుంబానికి మంచి జరిగిందని నమ్మితేనే ఓట్లేసి గెలిపించమని డైరెక్టుగానే అడుగుతున్నారు. అంటే తన గెలుపుపై జగన్ ఎంతటి నమ్మకం పెట్టుకున్నారో అర్ధమవుతోంది. తన ప్రభుత్వం వల్ల లబ్ది పొందిన కుటుంబాలు మళ్ళీ వైసీపీకే ఓట్లేస్తారని జగన్ బలంగా నమ్ముతున్నారు.

ఇదే సమయంలో జగన్ పాలనలో అరాచకాలని, అవినీతని, దాడులని, మహిళలపై హత్యాచారాలని, ప్రతిపక్షాలపై నియంత్రణని, చీకటి జీవోలని, నియంత పాలనని చంద్రబాబు, పవన్ గోలగోల చేసేస్తున్నారు. నిజానికి జగన్ పాలనపై చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణల్లో అత్యధికం టీడీపీ హయాంలో కూడా జరిగిందే. అందుకనే జనాలు 2019 ఎన్నికల్లో టీడీపీని ఘోరంగా ఓడించారు. రాజకీయంగా వైసీపీ-టీడీపీ, జనసేన మధ్య గొడవలు ఎన్నిజరుగుతున్నా తమకు సంబంధం లేదన్నట్లుగానే జనాలు చూస్తున్నారు. ప్రభుత్వం వల్ల తమకు లబ్ది జరిగిందని అనుకుంటే జగన్‌కు రెండోసారి అధికారం ఖాయం. లేకపోతే ఓట్లలో చీలిక తప్పదు. అప్పుడెవరు లాభపడతారో చూడాలి.

Next Story