Telugu Global
Andhra Pradesh

ఏ సామాజికవర్గం టీడీపీకి మద్దతుగా ఉంది..?

రేపటి ఎన్నికల్లో కూడా బీసీలు తమతోనే ఉంటారని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. ఇదేసమయంలో బీసీలు తమదగ్గరకు మళ్ళీ వస్తారని చంద్రబాబునాయుడూ అనుకోవటంలేదు.

ఏ సామాజికవర్గం టీడీపీకి మద్దతుగా ఉంది..?
X

బలమైన సామాజికవర్గాలు మద్దతిస్తే ఫలితాలు ఎలాగుంటుందో పోయిన ఎన్నికల్లో రుజువైంది. దశాబ్దాలుగా టీడీపీనే అంటిపెట్టుకునున్న బీసీల్లో చీలికవచ్చి కొన్నిసెక్షన్లు వైసీపీకి మద్దతిచ్చాయి. ఇదే సమయంలో ఇతర సామాజికవర్గాల్లో కూడా పెరిగిపోయిన వ్యతిరేకత కారణంగా టీడీపీకి ఘోరపరాజయం తప్పలేదు. బీసీలు దూరమవ్వటం, ఇతర సామాజికవర్గాల్లో వ్యతిరేకతంతా చరిత్ర అనుకుందాం. మరి భవిష్యత్తేమిటి ? అనేది చంద్రబాబునాయుడును పట్టిపీడిస్తున్న‌ ప్రశ్న.

సమాజంలో బీసీలు, కాపులే బలమైన సామాజికవర్గాలన్న విషయం అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల ఫలితాల ఆధారంగా బీసీలు వైసీపీవైపు మొగ్గుచూపారని అర్ధమవుతోంది. కాపులు ఏ పార్టీతోనే ఐడెంటిఫై కాలేదు. కాకపోతే మెజారిటీ సెక్షన్లు వైసీపీకే ఓట్లేశాయి. ఇక్కడ గమనించాల్సిందేమంటే కాపులు ఏ పార్టీతోనూ ఐడెంటిఫై కానప్పటికీ మెజారిటీ వైసీపీతోను మరికొందరు జనసేనకు ఓట్లేశారు. అంటే టీడీపీకి మద్దతుగా నిలబడిన కాపుల సంఖ్య తక్కువనే చెప్పాలి.

రేపటి ఎన్నికల్లో కూడా బీసీలు తమతోనే ఉంటారని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. ఇదేసమయంలో బీసీలు తమదగ్గరకు మళ్ళీ వస్తారని చంద్రబాబునాయుడూ అనుకోవటంలేదు. అందుకనే ఒకవైపు బీసీలను దువ్వుతునే మరోవైపు జగన్ పై బురదచల్లేస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే. అలాగే జనసేన+బీజేపీ లేదా జనసేన ఒంటరిగా పోటీచేస్తే కాపులు ఎక్కువగా జనసేన వైపు వెళ్ళే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. అలాగే మరికొందరు వైసీపీకి మద్దతిచ్చే అవకాశమూ లేకపోలేదు. మరి ఇదే జరిగితే టీడీపీ పరిస్ధితి ఏమిటి ?

బీసీలూ దగ్గరకు రాక, కాపులూ దూరమైపోతే మరింకే సామాజికవర్గం టీడీపీకి మద్దతుగా నిలుస్తుంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, మైనారిటిలు టీడీపీకి దూరమైపోయారు. మిగిలిన రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ సామాజికవర్గాల్లో టీడీపీకున్న మద్దతు ఎంత ? కమ్మ సామాజికవర్గం సాలిడ్ గా టీడీపీకి మద్దతుగా నిలిచే అవకాశముంది. మరి మిగిలిన సామాజికవర్గాలు ? ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం దొరకాలంటే ఎన్నికల రిజల్టు వరకు వెయిట్ చేయాల్సిందే.

First Published:  7 Dec 2022 5:30 AM GMT
Next Story