Telugu Global
Andhra Pradesh

బడుగులకు న్యాయం చేసింది జగన్ ఒక్కడే.. ఇదిగో సాక్ష్యం

అంబేద్కర్ కు జగన్ అర్పిస్తున్న ఘన నివాళి ఇది. ఇలాంటి టైమ్ లో కూడా ఎల్లో మీడియా చెత్త రాతలు రాస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈనాడు ఆర్టికల్ కు సోషల్ మీడియాలో గట్టిగా బదులిస్తున్నారు.

బడుగులకు న్యాయం చేసింది జగన్ ఒక్కడే.. ఇదిగో సాక్ష్యం
X

ఏపీలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా రాజకీయ రచ్చ మొదలైంది. అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత జగన్ కి ఎక్కడుందంటూ ఈనాడు ఇచ్చిన ఆర్టికల్ సంచలనంగా మారింది. అయితే ఈనాడు ఈ ఆర్టికల్ వేయడం ఒకందుకు వైసీపీకే మంచిదయింది. అసలు దళితులకు న్యాయం చేసింది ఎవరు అనే చర్చ రాష్ట్రంలో మొదలైంది. బీసీలు, గిరిజనులు, మైనార్టీలకు ఎవరు రాజ్యాధికారాన్ని కలిగించారనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే.. బడుగులకు న్యాయం చేసింది జగన్ మాత్రమేననే విషయం రుజువవుతుంది.

జగన్ హయాంలో ఏం జరిగిందంటే..?

నగదు బదిలీ(డీబీటీ) రూపంలో రూ.2.46 లక్షల కోట్లను ఇప్పటి వరకు పేదల ఖాతాల్లో వైసీపీ ప్రభుత్వం జమ చేసింది. ఇందులో 75 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చేరాయి. అంటే ఆ లబ్ధి జగన్ హయాంలో మాత్రమే జరిగిన మేలు అని వేరే చెప్పక్కర్లేదు. మిగతా పథకాల ద్వారా రూ.1.67 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని ఆయా వర్గాలు అందుకున్నాయి. మొత్తగా.. డీబీటీ, నాన్‌ డీబీటీ పథకాల ద్వారా పేదలకు రూ.4.13 లక్షల కోట్ల మేర లబ్ధి జగన్ హయాంలో జరిగింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి జగన్ 17 మంత్రి పదవులిచ్చారు. అంటే మంత్రి మండలిలో 70శాతం వారిదే వాటా. ఏకంగా నలుగురు ఉప ముఖ్యమంత్రి పదవులు కూడా వారికే ఇచ్చారు జగన్. తొలిసారిగా ఎస్సీ మహిళను హోం మంత్రిగా నియమించారు.




ఇవి కాకుండా జగన్ హయాంలో 69 శాతం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవుల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు. మేయర్ పదవుల్లో 86 శాతం వారికే ఇచ్చారు. ఆలయ బోర్డు మెంబర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు.. ఇలా అన్నిట్లోనూ ఎక్కువగా ఆయా వర్గాలకే ప్రాధాన్యం ఇచ్చారు సీఎం జగన్. బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వాటిలో 684 డైరెక్టర్‌ పదవులు ఇచ్చారు.

తాజాగా బెజవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంబేద్కర్ కు జగన్ అర్పిస్తున్న ఘన నివాళి ఇది. ఇలాంటి టైమ్ లో కూడా ఎల్లో మీడియా చెత్త రాతలు రాస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈనాడు ఆర్టికల్ కు సోషల్ మీడియాలో గట్టిగా బదులిస్తున్నారు.

First Published:  19 Jan 2024 10:59 AM GMT
Next Story