Telugu Global
Andhra Pradesh

చంద్రబాబును కాదంటే పవన్ పరిస్ధితేంటో తెలుసా?

అదే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కాకుండా విడిగానే పోటీ చేయటం ఖాయమని తేలితే అప్పుడేంటి పరిస్దితి? పవన్ వల్ల చంద్రబాబుకు నష్టం జరుగుతుందని తేలితే అప్పుడు ఎల్లో మీడియా ఏం చేస్తుంది?

చంద్రబాబును కాదంటే పవన్ పరిస్ధితేంటో తెలుసా?
X

చంద్రబాబు నాయుడు అతిపెద్ద మద్దతుదారు మీడియానే. వ్యవస్ధలన్నింటినీ మ్యానేజ్ చేసుకోవటం వల్లే చంద్రబాబు ఈస్ధాయికి ఎదిగారనే ప్రచారంలో ఎంత నిజముందో తెలీదు. అయితే మెజారిటి మీడియాతో ఆయనకున్న అనుబంధం మాత్రం ఎప్పటికీ విడదీయలేనిది. తనకున్న మీడియా బలంతోనే తన ప్రత్యర్ధులను చంద్రబాబు చీల్చిచెండాడుతుంటారు. తన ప్రత్యర్ధులను చంద్రబాబు డైరెక్టుగా కొంతవరకే ఎదుర్కొంటారు. మిగిలిన పనంతా ఆయన తరపున మీడియానే చేసేస్తుంది.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగానే కాకుండా వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు మీడియా ఏ విధంగా ఎటాక్ చేస్తోందో అందరు చూస్తున్నదే. ఉన్నవీ లేనివీ అన్నింటినీ కలిపేసి జగన్‌పై ప్రతిరోజు బురదచల్లేస్తోంది కాబట్టి ఈ మీడియాపైన ఎల్లోమీడియా అనే ముద్ర పడిపోయింది. ఈ మీడియా టార్గెట్ ఏమిటంటే చంద్రబాబుతో బాగుండే వాళ్ళని ఆకాశానికి ఎత్తేయటం, లోపాలను కప్పేయటం. ప్రత్యర్ధులపైన రెచ్చిపోయి బురద చల్లేయటమే పనిగా మీడియా పనిచేస్తుంటుంది.

ఇప్పుడు చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సఖ్యతగా ఉన్నాడు కాబట్టి ఆకాశానికి ఎత్తేస్తోంది. పవన్ తుమ్మినా, దగ్గినా బాగా హైపిచ్చేస్తోంది. ఇదంతా ఎందుకు చేస్తోందంటే రేపటి ఎన్నికల్లో చంద్రబాబుకు పవన్ వల్ల ఉపయోగం ఉంటుందని అనుకుని. అదే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కాకుండా విడిగానే పోటీ చేయటం ఖాయమని తేలితే అప్పుడేంటి పరిస్దితి? పవన్ వల్ల చంద్రబాబుకు నష్టం జరుగుతుందని తేలితే అప్పుడు ఎల్లో మీడియా ఏంచేస్తుంది? ఏముంది ఇప్పుడు జగన్ పైన ఎలా బురదచల్లేస్తోందో అప్పుడు పవన్ పైనా అదే చేస్తుంది.

గతంలో కూడా చంద్రబాబు నుండి దూరంగా జరిగారనే పవన్ పైన ఎల్లో మీడియా ఎలా విరుచుకుపడిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో వ్యతిరేక వార్తలతో కొద్ది రోజులు ఎల్లో మీడియా పవన్‌ను చీల్చి చెండాడేసింది. తర్వాత ఇద్దరు ఒకటవ్వగానే మళ్ళీ పవన్ గురించి ఆహా ఓహో అని మొదలుపెట్టింది. ఎల్లో మీడియా వ్యతిరేకతను జగన్ కాబట్టి మొండిగా తట్టుకుని నిలబడ్డారు. పవన్ మనస్తత్వానికి అది సాధ్యంకాదు. చిన్న విషయాలకు కూడా పూనకమొచ్చినట్లు ఊగిపోయి రెచ్చిపోయే పవన్ ఎల్లో మీడియా దెబ్బను తట్టుకోవటం కష్టమే. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

First Published:  15 Nov 2022 4:51 AM GMT
Next Story