Telugu Global
Andhra Pradesh

పీవీ రమేష్ ఇప్పుడేం చెబుతాడు?

ఇదే సమయంలో సీమెన్స్ కంపెనీ తాజాగా మరో ప్రకటన చేసింది. డిజైన్ టెక్ కంపెనీ మధ్యవర్తిగా ఏపీ ప్రభుత్వంతో తమ కంపెనీ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని స్పష్టంగా చెప్పేసింది.

పీవీ రమేష్ ఇప్పుడేం చెబుతాడు?
X

ఎల్లో మీడియా అత్యుత్సాహమే చంద్రబాబు నాయుడు కొంప ముంచేస్తున్నట్లుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. స్కిల్ స్కామ్‌లో ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ అయ్యారో వెంటనే ఎల్లో మీడియా ఓవర్ యాక్షన్ మొదలుపెట్టేసింది. ఎలాగైనా చంద్రబాబును నిప్పు అని నిరూపించేందుకు రకరకాల విన్యాసాలు చేస్తోంది. ఇందులో భాగంగానే సీమెన్స్ కంపెనీ తరపున ఇండియా ఎండీగా వ్యవహరించిన సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ ఖన్వీల్కర్ తదితరులతో మొదటి పేజీల్లో ఇంటర్వ్యూలు అచ్చేసింది.

వాళ్ళిద్దరూ చెప్పిందేమిటంటే ఎలాంటి స్కామ్ జరగలేదని, చంద్రబాబు అరెస్టు అక్రమమని. ఇంతకీ విషయం ఏమిటంటే వీళ్ళిద్దరిని ఇదే స్కామ్‌లో ఈడీ ఎప్పుడో అరెస్టు చేసింది. ఇద్ద‌రూ బెయిల్ మీద బయట ఉన్నారు. అంటే స్కామ్‌లో తోడు దొంగలే ఇప్పుడు చంద్రబాబుకు క్లీన్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. పైగా వీళ్ళిద్దరూ సీమెన్స్ తో చేసుకున్న ఒప్పందం అంతా సక్రమమనే చెబుతున్నారు. ఇదే సమయంలో సీమెన్స్ కంపెనీ తాజాగా మరో ప్రకటన చేసింది. డిజైన్ టెక్ కంపెనీ మధ్యవర్తిగా ఏపీ ప్రభుత్వంతో తమ కంపెనీ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని స్పష్టంగా చెప్పేసింది.

కెంపెనీ తాజా ప్రకటనతో సుమంత్ బోస్, ఖన్వీల్కర్, చంద్రబాబు, లోకేష్ చెబుతున్నదంతా అబద్ధాలే అని నిర్ధారణ అవుతోంది. సుమంత్, ఖన్వీల్కర్ ఇంటర్వ్యూలను ఎల్లో మీడియా అచ్చేయకపోతే అసలు సీమెన్స్ రెండు సార్లు బహిరంగ ప్రకటన చేసేదికాదేమో. కోర్టుకిచ్చిన అఫిడవిట్‌తోనే సరిపెట్టుకునేది. అలాగే ఫైనాన్స్ ప్రిన్సిప‌ల్‌ సెక్రటరీగా పనిచేసిన పీవీ రమేష్‌తో కూడా ఇంటర్వ్యూ చేసింది.

ఆ ఇంటర్వ్యూలో రమేష్‌తో మాట్లాడించి చంద్రబాబుకు క్లీన్ సర్టిఫికెట్ ఇప్పించింది. ఎప్పుడైతే చంద్రబాబుకు రమేష్ క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారో వెంటనే చంద్రబాబు ఒత్తిడితోనే నిధులు విడుదల చేస్తున్నట్లు రమేష్ అప్పట్లో రాసిన నోట్ ఫైళ్ళు సోషల్ మీడియాలో కనిపించాయి. దాంతో మామూలు జనాలకు కూడా చంద్రబాబు చేసిన అవినీతి అర్థ‌మైపోయింది. చంద్రబాబు అవినీతిని కప్పిపుచ్చేందుకు ఎల్లో మీడియా ఎంతగా ప్రయత్నిస్తోందో అవినీతి అంతగా స్పష్టంగా బయటపడుతోంది. అంటే ఎల్లో మీడియానే చంద్రబాబు కొంపముంచేస్తోందని అర్థ‌మవుతోంది.


First Published:  19 Sep 2023 6:27 AM GMT
Next Story