Telugu Global
Andhra Pradesh

మండుతున్న ఎండ‌లు.. ఏపీ స్కూల్స్‌లో వాట‌ర్ బెల్స్‌

వేస‌వి కావ‌డంతో ప్ర‌స్తుతం ఒంటిపూట బ‌డులు న‌డుస్తున్నాయి. ఉద‌యం 7.30, 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కే పాఠ‌శాల‌ల నిర్వహిస్తున్నారు.

మండుతున్న ఎండ‌లు.. ఏపీ స్కూల్స్‌లో వాట‌ర్ బెల్స్‌
X

ఏప్రిల్ వ‌చ్చేసింది.. ఎండ‌లు మండిపోతున్నాయి. ఓప‌క్క ప‌రీక్ష‌ల హ‌డావుడితో పిల్ల‌లు స్కూళ్ల‌కు ప‌రుగులు పెడుతున్నారు. ఈనేపథ్యంలో విద్యార్థులు డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉండ‌టానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ వినూత్న నిర్ణ‌యం తీసుకుంది. రోజుకు మూడుసార్లు వాట‌ర్ బెల్ మోగించాల‌ని నిర్ణ‌యించింది. ఆ బెల్ మోగిన‌ప్పుడ‌ల్లా విద్యార్థుల‌ను మంచినీళ్లు తాగ‌మ‌ని ఉపాధ్యాయులు పంపిస్తారు.

ఒక్క పూట‌లోనే మూడుసార్లు

వేస‌వి కావ‌డంతో ప్ర‌స్తుతం ఒంటిపూట బ‌డులు న‌డుస్తున్నాయి. ఉద‌యం 7.30, 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కే పాఠ‌శాల‌ల నిర్వహిస్తున్నారు. ఉన్న ఈ ఒక్క‌పూట‌లోనే మూడుసార్లు వాట‌ర్ బెల్స్ మోగించ‌బోతున్నారు. ఉద‌యం 8.45, 10.50, 11.50 గంట‌ల‌కు బెల్ మోగించాల‌ని పాఠ‌శాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలా బెల్ మోగిన‌ప్పుడ‌ల్లా పిల్ల‌ల్ని మంచినీళ్లు తాగ‌డానికి పంపిస్తారు. వేస‌వి నేప‌థ్యంలో పిల్ల‌లు డీ హైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు విద్యాశాఖ ప్ర‌క‌టించింది.

First Published:  2 April 2024 2:35 PM GMT
Next Story