Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు.. చీటర్‌కు 850 ఎకరాలా.. నల్లారి పాత వీడియో వైరల్‌

అప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఇదే అంశంపై అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబును నిలదీసిన వీడియో సోషల్‌మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

చంద్రబాబు.. చీటర్‌కు 850 ఎకరాలా.. నల్లారి పాత వీడియో వైరల్‌
X

ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో జరిగిన భూకేటాయింపులపై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. చంద్రబాబు హయాంలో బిల్లీరావు అనే వ్యక్తికి 850 ఎకరాలు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్ ప్రభుత్వం రద్దు చేసింది. వైఎస్సార్ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థిస్తూ గురువారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. చంద్రబాబు కారుచ‌వ‌కగా ఎకరం రూ.50 వేలకే కట్టబెట్టిన భూమి విలువ ఇప్పుడు లక్షల కోట్లలో ఉంటుందని సమాచారం.

అయితే తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఇదే అంశంపై అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబును నిలదీసిన వీడియో సోషల్‌మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

అసెంబ్లీలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బిల్లీరావుకు, ఇన్ఫోసిస్‌కు పోలిక ఏంటని చంద్రబాబును, తెలుగుదేశం నేతలను ప్రశ్నించారు. బిల్లీరావు అనే వాడు ఒక చీటర్‌ అని.. ఐఐటీ మార్క్స్ లిస్టును ఫోర్జరీ చేసిన వ్యక్తి బిల్లీరావు అంటూ చెప్పుకొచ్చారు కిరణ్‌కుమార్ రెడ్డి. చీటర్లు, క్రిమినల్స్‌కు చంద్రబాబు విలువైన భూములు కట్టబెట్టారంటూ ఆ వీడియోలో మండిపడ్డారు కిరణ్ కుమార్ రెడ్డి.

First Published:  9 March 2024 6:04 AM GMT
Next Story