Telugu Global
Andhra Pradesh

వివాహిత మిస్సింగ్.. ఊహించని ట్విస్ట్

సాయి ప్రియ గాలింపు కోసం అధికారులు సుమారు రూ. కోటి ఖర్చు చేశారు. ఈ విషయమై విశాఖ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ మాట్లాడుతూ.. వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని తెలిపారు

Sai Priya Missing Case
X

ఇటీవల ఆర్కే బీచ్ లో సాయిప్రియ అనే వివాహిత తప్పిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారింది. వివాహిత సముద్రంలో కొట్టుకుపోయిందేమోనని అంతా భావించారు. ప్రభుత్వం ఎంతో ఖర్చుపెట్టి హెలికాప్టర్, నేవీ బృందాల సాయంతో సముద్రాన్ని జల్లెడ పట్టింది. కానీ ఈ విషయంలో ఇవాళ పోలీసులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. వివాహిత తన ప్రియుడితో కలిసి నెల్లూరు జంప్ అయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అధికారులు, పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

విశాఖకు చెందిన సాయిప్రియ.. శ్రీనివాస్ 2020 జూలై 25న పెళ్లిచేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమే. అయితే పెళ్లికి ముందే సాయిప్రియ.. నెల్లూరుకు చెందిన శివ అనే వ్యక్తిని ప్రేమించింది. అయినప్పటికీ తల్లిదండ్రులు మాత్రం శ్రీనివాస్ తో పెళ్లి చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ హైదరాబాద్ లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. అక్కడే వీరు కాపురం పెట్టారు.కానీ కొన్ని రోజుల క్రితం కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటానంటూ సాయిప్రియ విశాఖకు వచ్చింది.

ఇదిలా ఉంటే శ్రీనివాస్ పెళ్లి రోజు సందర్భంగా గత జూలై 25న విశాఖ వచ్చి.. సాయిప్రియతో కలిసి ఆర్కే బీచ్ కు వచ్చాడు. అంతకు ముందే సాయి ప్రియ ఆ సమాచారాన్ని ప్రియుడు రవికి చేరవేసింది. శ్రీనివాస్‌ ఏమరపాటుగా ఉన్న సమయంలో రవితో కలిసి సాయి ప్రియ అక్కడి నుంచి పారిపోయింది. ఇది తెలియని శ్రీనివాస్‌ తన భార్య నీటిలో గల్లంతు అయి ఉంటుందని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఏకంగా హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

గాలింపు కోసం రూ. కోటి ఖర్చు

సాయి ప్రియ గాలింపు కోసం అధికారులు సుమారు రూ. కోటి ఖర్చు చేశారు. ఈ విషయమై విశాఖ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ మాట్లాడుతూ.. వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. ప్రస్తుతం సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని చెప్పారు. ఆమెను నెల్లూరు నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.

First Published:  27 July 2022 11:51 AM GMT
Next Story