Telugu Global
Andhra Pradesh

'గడపగడపకు' బాగుంది.. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య ప్రశంసలు

‘గడపడగడపకు‘ లాంటి కార్యక్రమాలు ఎంతో ఆదర్శనీయం’ అంటూ వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గడపగడపకు బాగుంది..  మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య ప్రశంసలు
X

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 'గడపగడపకు మన ప్రభుత్వం' అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమకార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అని తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంపై సీఎం జగన్ కూడా గట్టిగా ఫోకస్ పెట్టారు. ఇటీవల వర్క్ షాప్ నిర్వహించారు. కొందరు ఎమ్మెల్యేలపై సీరియస్ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంపై ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. అయినప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం నియోజకవర్గాల్లోనే తిరుగుతున్నారు.

ఇదిలా ఉంటే గడపగడపకు కార్యక్రమంపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన నెల్లూరులో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ' గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఎంతో బాగుంది. ఏ పార్టీ ప్రజాప్రతినిధి అయినా నిత్యం ప్రజల్లోకి వెళ్లాలి. వాళ్ల సమస్యలు తెలుసుకోవాలి. ప్రభుత్వ సంక్షేమపథకాలు అందుతున్నాయో.. లేదో తెలుసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు అందకపోతే .. తగిన చర్యలు తీసుకోవాలి. 'గడపడగడపకు' లాంటి కార్యక్రమాలు ఎంతో ఆదర్శనీయం' అంటూ వెంకయ్య వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

First Published:  4 Oct 2022 1:34 PM GMT
Next Story