Telugu Global
Andhra Pradesh

బాలయ్యకు షాకిచ్చిన సీఎం జగన్..!

కందుకూరు, గుంటూరు వరుస దుర్ఘటనల తర్వాత ఏపీ ప్రభుత్వం రోడ్ షో లు నిషేధిస్తూ జీవో తెచ్చింది. అయితే అనుకోకుండా ఈ జీవో కారణంగా బాలకృష్ణ కొత్త సినిమా వీర సింహారెడ్డి ఇబ్బందుల్లో పడింది.

బాలయ్యకు షాకిచ్చిన సీఎం జగన్..!
X

ఏపీలో జీవో నెంబర్-1 ఎంత సంచలనం సృష్టిస్తోందో అందరికీ తెలుసు. ఆ జీవో వచ్చిన తర్వాత ఏపీలో ఎక్కడా సభలు, సమావేశాలు, రోడ్ షో లకు అనుమతి ఇవ్వడంలేదు. కందుకూరు, గుంటూరు వరుస దుర్ఘటనల తర్వాత ఏపీ ప్రభుత్వం రోడ్ షో లు నిషేధిస్తూ ఈ జీవో తెచ్చింది. అయితే అనుకోకుండా ఈ జీవో కారణంగా బాలకృష్ణ కొత్త సినిమా వీర సింహారెడ్డి ఇబ్బందుల్లో పడింది. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమా ప్రచారానికి ఒంగోలులో చేస్తున్న ఏర్పాట్లన్నీ వృథా అయ్యాయి. ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పోలీసులు అనుమతి నిరాకరించడంతో చిత్ర యూనిట్ ఆ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసుకుంది. ఈనెల 6వ తేదీన ఒంగోలులోని ఏబీఎం కాలేజ్ గ్రౌండ్స్ లో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు సడన్ గా రద్దు చేశారు.




వీరసింహారెడ్డి సినిమా దర్శకుడు, గోపీచంద్ మలినేని సొంత ఊరు ప్రకాశం జిల్లాలో ఉంది. అందుకే ఆ ప్రాంతంపై అభిమానంతో ఆయన ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. నిర్మాతలతో కలసి భారీ స్థాయిలో ఈవెంట్ చేయాలనుకున్నారు. బాలకృష్ణ కూడా ఈ ఈవెంట్ కి రావాల్సి ఉంది. అయితే ఏపీలో జరుగుతున్న పరిణామాలు అనుకోకుండా ఈ సినిమాకి షాకిచ్చాయి. ఏపీలో రోడ్ల పక్కన బహిరంగ సభలు, రోడ్ షో లకు అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. పోలీస్ యాక్ట్ అమలు చేస్తామంటోంది. అందుకే ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బ్రేక్ పడింది.

బాబు, బాలయ్య ఇద్దరూ బాధితులే..!

ఈరోజు కుప్పంలో కూడా చంద్రబాబు సభను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం తన సభలకు వస్తున్న జనాన్ని చూసి భయపడి ఈ చీకటి జీవో తెచ్చిందని చంద్రబాబు విమర్శించారు. జగన్ కి సీఎం కుర్చీ దూరమయ్యే టైమ్ దగ్గర పడిందని, ప్రజలంతా ఆయనపై అసంతృప్తిగా ఉన్నారని శాపనార్థాలు పెట్టారు. ఇటు ఒంగోలులో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. బాలకృష్ణ ఈవెంట్ ని సడన్ గా ఆపేసుకోవాల్సి వచ్చింది. పోలీసులు నిరాకరించడంతో ఈవెంట్ ని రద్దు చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. సినిమా యూనిట్ కి చెందినవారెవరూ ఇందులో రాజకీయ కోణాన్ని స్పృశించలేదు. సోషల్ మీడియాలో మాత్రం వీరసింహారెడ్డిని తొక్కేస్తారా అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

First Published:  4 Jan 2023 4:13 PM GMT
Next Story