Telugu Global
Andhra Pradesh

జగన్‌పై ఈ ఎంపీ ఒత్తిడి పెంచేస్తున్నారా..?

నియోజకవర్గంలో తనకున్న విస్తృతమైన పరిచయాల కారణంగా తాను ఈజీగా గెలుస్తానని ఆమె జగన్ తో పదేపదే చెబుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇదే సందర్భంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కూడా గీతకు మద్దతుగా జగన్‌తో మాట్లాడారట

జగన్‌పై ఈ ఎంపీ ఒత్తిడి పెంచేస్తున్నారా..?
X

వచ్చే ఎన్నికల్లో తనకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయాటానికి అవకాశం ఇవ్వాలంటు ఓ ఎంపీ జగన్మోహన్ రెడ్డిపై బాగా ఒత్తిడి పెంచేస్తున్నట్లు సమాచారం. విషయం ఏమిటంటే.. కాకినాడ ఎంపీ వంగా గీత వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీచేయాలని డిసైడ్ అయ్యారట. అందుకనే తనకు పిఠాపురంలో పోటీచేసే అవకాశం ఇవ్వాలని జగన్ పై ఒత్తిడిపెంచేస్తున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు ఆరోగ్యం సరిగా లేకపోవటం, జనాల్లో వ్యతిరేకత కూడా పెరిగిపోతోందని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పోటీకి వంగా గీత రెడీ అయిపోతున్నారు. గీతకు కలిసొచ్చే అవకాశాలు ఏమిటంటే.. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ నియోజకవర్గంలో కాపుల ఓట్లు చాలా ఎక్కువ. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా, తర్వాత రాజ్యసభ ఎంపీగా ఆ తర్వాత ఎమ్మెల్యే, ఇప్పుడు మళ్లీ లోక్ సభ ఎంపీగా ఉన్నారు. ఇన్నిరకాల పదవుల్లో ఉన్న కారణంగా నియోజకవర్గంలోని ప్రజలతో మంచి సంబంధాలు మైయిన్‌టైన్ చేస్తున్నారట.

నియోజకవర్గంలో తనకున్న విస్తృతమైన పరిచయాల కారణంగా తాను ఈజీగా గెలుస్తానని ఆమె జగన్ తో పదేపదే చెబుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇదే సందర్భంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కూడా గీతకు మద్దతుగా జగన్‌తో మాట్లాడారట. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం అధికారిక కార్యక్రమాలకు కూడా పెద్దగా హాజరుకావటంలేదని తెలిసింది. అనారోగ్య కారణాలతోనే బయటకు రావటం తగ్గించేశారట.

వచ్చే ఎన్నికల్లో ఇక్కడినుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేస్తారని బాగా ప్రచారం జరుగుతోంది. పవన్‌ను ఓడించటానికి తనకు చాలా అవకాశాలున్నాయని గీత చాలా లెక్కలే చెబుతున్నారట. ప్రభుత్వ పథకాల లబ్దిదారులు, ప్రత్యేకించి మహిళలు, కాపుల ఓట్లలో సానుకూలత లాంటి అనేక ప్లస్ పాయింట్లను గీత చెప్పుకుంటున్నారు. పదవుల్లో ఉన్నా.. లేకపోయినా తాను ప్రజలందరికీ అందుబాటులో ఉండటం కూడా ప్లస్ అవుతుందని గీత భావిస్తున్నారు. మొత్తానికి గీత ఒత్తిళ్ళు జగన్ పై పనిచేస్తాయా..? అనేది కీలకంగా మారింది.

First Published:  31 Oct 2022 7:02 AM GMT
Next Story