Telugu Global
Andhra Pradesh

రద్దీ రూట్లో వందే భారత్.. ఏప్రిల్ 9నుంచి గ్రీన్ సిగ్నల్

వందే భారత్ కేవలం నాలుగు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా తిరుపతి తీసుకెళ్తుంది. రైలు ఆగే స్టేషన్ల వివరాలపై రెండు రోజులుగా ఫేక్ న్యూస్ హల్ చల్ చేసినా అధికారికంగా స్టేషన్ల లిస్ట్ ఇప్పుడు విడుదలైంది.

రద్దీ రూట్లో వందే భారత్.. ఏప్రిల్ 9నుంచి గ్రీన్ సిగ్నల్
X

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఎక్స్ ప్రెస్ రైళ్లలో సగటు ప్రయాణ సమయం 12 గంటలు. రోజులో సగం ప్రయాణానికే సరిపోతుంది. ఈ సమయాన్ని దాదాపు మూడున్నర గంటలు తగ్గించబోతోంది వందేభారత్ ఎక్స్ ప్రెస్. కేవలం 8.30 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణికుల్ని ఈ రైలు తీసుకెళ్తుంది. ప్రయాణం ఈనెల 9న తిరుపతి నుంచి ప్రారంభమవుతుంది.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖకు వందే భారత్ రైలు నడుస్తోంది. దీనికి అదనంగా ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరో రైలు వేశారు. ఏప్రిల్ 8న అధికారికంగా రైలు ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఆరోజు ప్రయాణికులు లేకుండా కేవలం స్టాఫ్ తోనే సికింద్రాబాద్ నుంచి రైలు తిరుపతికి వెళ్తుంది. ఏప్రిల్9న తిరుపతి నుంచి అధికారికంగా ప్రయాణికులతో సికింద్రాబాద్ బయలుదేరుతుంది.

స్టేషన్లు పరిమితం..

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఏయే స్టేజ్ లు ఉన్నాయో తెలుసుకోవాలంటే కృష్ణా ఎక్స్ ప్రెస్ ఎక్కాల్సిందే. వందే భారత్ ఎక్కితే మాత్రం మధ్యలో కేవలం నాలుగు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా తిరుపతి తీసుకెళ్తుంది. రైలు ఆగే స్టేషన్ల వివరాలపై రెండు రోజులుగా ఫేక్ న్యూస్ హల్ చల్ చేసినా అధికారికంగా స్టేషన్ల లిస్ట్ ఇప్పుడు విడుదలైంది.

ఏప్రిల్ 9న తిరుపతిలో మధ్యాహ్నం 3.15 గంటలకు వందేభారత్ బయలుదేరుతుంది. ఆ తర్వాత నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, నల్గొండ లో ఆగుతుంది. రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుపతి నుంచి బయలుదేరే ట్రైన్ నెంబర్ 20702

ఏప్రిల్ 10న వందేభారత్ రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరుతుంది. ఉదయం 6గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరే రైలు మధ్యాహ్నం 2.30 కల్లా తిరుపతికి వచ్చేస్తుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ట్రైన్ నెంబర్ 20701. ప్రస్తుతానికి టైమింగ్స్ ప్రకటించినా చార్జీల వివరాలు అధికారికంగా విడుదల కావాల్సి ఉంది.

First Published:  31 March 2023 3:06 AM GMT
Next Story